పిల్ల జమిందార్..భాగమతి సినిమాలు గుర్తున్నాయి కదా…ఆ సినిమాల డైరక్టర్ అశోక్. ఆ రెండు హిట్ లు మాత్రమే కాదు సుకుమారుడు..చిత్రాంగద..దుర్గామతి లాంటి మూడు నాలుగు దారుణ ఫ్లాపులు కూడా మనవాడి ఖాతాలోనే వున్నాయి.
చిరకాలంగా అశోక్ పేరు వినిపించడం లేదు. ఇప్పుడు ఇన్నాళ్ల తరువాత ఓ సినిమా చేతిలోకి వచ్చింది. ఒక కన్నడ నిర్మాత తెలుగు సినిమా తీయడానికి ముందుకు వచ్చారు.
హీరో నాగశౌర్య డేట్ లు దొరికాయి.నిర్మాత దొరికాడు. అందువల్ల త్వరలో అశొక్ డైరక్షన్ లో మరో సినిమా స్టార్ట్ కాబోతోంది. ఈ సినిమాకు నాగ శౌర్యకు అతని కెరీర్ లో హయ్యస్ట్ రెమ్యూనిరేషన్ ముట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకన్నా ముందుగా సుధాకర్ నిర్మాణంలో ఓ సినిమాను నాగశౌర్య ఫినిష్ చేయాల్సి వుంది.
ఇదిలా వుంటే నాగశౌర్య హోమ్ బ్యానర్ లో నిర్మించిన కృష్ణ వృింద విహారి సినిమా ఈనెల మూడో వారంలో విడుదలకు రెడీ అవుతోంది.