సెప్టెంబర్ 1వ తేదీన చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టి 27 సంవత్సరాలు దాటిన సందర్భంగా టీడీపీ సెలెబ్రేషన్స్ పై తనదైన శైలిలో విమర్శలు కురిపించారు మంత్రి జోగి రమేష్. సొంత మామను వెన్ను పోటు పొడిచి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన చంద్రబాబు.. సెప్టెంబర్ 1వ తేదిని అంతర్జాతీయ వెన్నుపోటు దినోత్సవం జరుపుకోవాలన్నారు.
వల్లకాటికి వెళ్లిపోతున్న తెలుగుదేశం పార్టీని లేపాలని పచ్చ పత్రికలు, ఛానళ్లు తాపత్రయపడుతున్నారని, టీడీపీని లేపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిన శూన్యమన్నారు. మామను వెన్నుపోటు పొడిచి.. పార్టీ లాక్కొని మళ్లీ ఎన్టీఆర్ గురించి మాట్లాడటం సిగ్గు చేటన్నారు. ప్రజలకు చంద్రబాబు ఎన్టీఆర్ ను ఎలా అవమానకరంగా పదవి నుండి దింపేశారాన్నది తెలుసున్నారు.
తమ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్నా చంద్రబాబు దమ్ముంటే, సత్తా ఉంటే అవినీతి జరిగిందని నిరుపించాలని ఛాలెంజ్ చేశారు. వైయస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా ప్రజలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతున్నారు. గత ప్రభుత్వంపై సీబీఐ దాడులు చేస్తే చంద్రబాబు బండరం మొత్తం బయటపడుతున్నారు.
'సెప్టెంబర్ 2వ తేదీ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు టీడీపీ విస్తృతస్థాయి సమావేశం అంటూ చంద్రబాబు డ్రామా మొదలుపెట్టాడన్నారు. వైయస్‌ఆర్‌ను ప్రజల గుండెలనుంచి చంద్రబాబు తొలగించలేడు. ఆ మహనీయుడి పేరు చెబితే ఆరోగ్యశ్రీ, ఉచిత విద్య, 108, 104, పేదలకు ఇళ్లు వంటి పథకాలు గుర్తుకొస్తాయి. చంద్రబాబు 14 సంవత్సరాల పాలనలో ఒక్క పథకం కూడా చెప్పుకోవడానికి లేదు' అని మంత్రి జోగి రమేష్ ఎద్దేవా చేశారు.