ఎక్కడయినా చాన్స్ లు ఇవ్వడం కోసం లేదా ఇప్పించడం కోసం ‘పెద్దోళ్ల’ నుంచి ఫోన్ లు చేస్తారు. కానీ ఈ కథ వేరు. చాన్స్ లు తప్పించడం కోసం ఫోన్ లు వస్తాయి.
టాలీవుడ్ లో చాన్స్ లు మిస్ చేసుకుంటున్న హీరోయిన్ వ్యవహారం ఇది. ఓ పరభాషా హీరోయిన్ వుంది. ఆమెకు తెలుగులో ఇలా చాన్స్ లు వస్తుంటాయి. అంతా అయిపోతుంది. కానీ అంతలోనే ఆ సినిమా చేజారిపోతుంది.
నిర్మాతలు, దర్శకులు ఏవేవో కారణాలు చెబుతారు. సినిమాలోంచి తప్పిస్తారు. అంతా ఆ అమ్మాయి బ్యాడ్ లక్ అనుకుంటారు అంతా. కానీ విషయం అది కాదు. వేరే వుందని తెలుస్తోంది.
ఆ అమ్మాయికి వేరే రాష్ట్రంలో చాలా ‘పెద్దోళ్ల’తో చాలా సన్నిహిత సంబంధాలు వున్నాయి. ఈమె సినిమాలు చేయడం ఆ పెద్దోళ్లకు అంతగా ఇష్టం లేదు. ఈమె వినదు. అందుకే ఆమె హైదరాబాద్ లో దిగిన దగ్గర నుంచి నిఘా మొదలవుతుంది. ఎవర్ని కలిసిందీ తెలుసుకుని, వాళ్లందరికీ సాయంత్రం వేళకు ఫోన్ లు వెళ్తాయి.
ఎవరైనా సినిమాలో పెట్టుకుంటే ఫోన్ లు వెళ్తాయి. ఏం చేస్తారో? ఏం చెప్తారో మీ ఇష్టం..చాన్స్ మాత్రం క్యాన్సిల్ కొట్టాల్సిందే అని హుకుం లు జారీ అవుతాయి.
గతంలో చేజారిన అవకాశాలు, ఇప్పుడు చేజారిన అవకాశం వెనుక కథ ఇదేనంట. లేటెస్ట్ గా చేజారిన సినిమా దర్శకుడికే నేరుగా ఫోన్ వచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.