ఆ ఇద్దరూ ‘విజిలేసారు’

మాస్ పల్స్ తెలిసిన డైరక్టర్ సంపత్ నంది. సరైన టైమింగ్ వుండి కూడా టైమ్ కలిసి రాక కిందా మీదా అవుతున్న హీరో గోపీచంద్. ఈ ఇద్దరు కలిసి మరోసారి తమ టాలెంట్ ను…

మాస్ పల్స్ తెలిసిన డైరక్టర్ సంపత్ నంది. సరైన టైమింగ్ వుండి కూడా టైమ్ కలిసి రాక కిందా మీదా అవుతున్న హీరో గోపీచంద్. ఈ ఇద్దరు కలిసి మరోసారి తమ టాలెంట్ ను లక్ ను చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే 'సీటీమార్'. ఇప్పటి వరకు ఈ టైటిల్ అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ వేసారు.

ఓ మాంచి మాస్ సినిమా చూడబోతున్న ఫీల్ ను లుక్ ను పోస్టర్ లో క్లియర్ గా చూపించేసారు సంపత్ నంది. ఈ సినిమాలో గోపీచంద్ అమ్మాయిల కబడ్డీ టీమ్ కు కోచ్ గా నటిస్తున్నారు. బ్యాంక్ ఆఫీసర్ గా, కబడ్డీ కోచ్ గా గోపీచంద్ కనిపించే ఈ సినిమా లో ఇటు ఆంధ్రలోని పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో సాంగ్స్, అటు ఢిల్లీ లాంటి మేజర్ అర్బన్ ఏరియాలో మాస్ ఎలివేషన్ సీన్లు వుంటాయి.

సంపత్ నందికి హీరోయిన్ తమన్నా లక్కీ హ్యాండ్. అందుకే మళ్లీ ఈ సినిమాలో కూడా తమన్నా నే హీరోయిన్ గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. చిట్టూరి శ్రీను-పవన్ నిర్మాత.