అయోమయంలో పవన్ భవితవ్యం

జనసేనానిగా ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ చెప్పిందే వేదం, అయ్యగారికి అవసరమనిపిస్తే వెంటనే ధర్నాలకు పిలిపునిచ్చేవారు, రెస్ట్ అవసరం అనుకుంటే వారాల తరబడి కనిపించకుండా పోయేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. జనసేనాని కాస్తా కమల సేనానిగా…

జనసేనానిగా ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ చెప్పిందే వేదం, అయ్యగారికి అవసరమనిపిస్తే వెంటనే ధర్నాలకు పిలిపునిచ్చేవారు, రెస్ట్ అవసరం అనుకుంటే వారాల తరబడి కనిపించకుండా పోయేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. జనసేనాని కాస్తా కమల సేనానిగా మారిపోయారు. బీజేపీ ఏం చెబితే దానికి తలూపే పరిస్థితి వచ్చేసింది. లాంగ్ మార్చ్ పోస్ట్ పోన్ కావడంతో పవన్ రేంజ్ ఏంటో అర్థమవుతోంది. 

ఫిబ్రవరి-2న లాంగ్ మార్చ్ చేస్తామని, ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామంటూ ప్రగల్భాలు పలికినా అవి వాస్తవరూపం దాల్చలేదు. కార్యక్రమం క్యాన్సిల్ కావడంపై కూడా పవన్ స్పందించలేని పరిస్థితి. పవన్ లాంగ్ మార్చ్ ఉంటుందని చెప్పారు, బీజేపీ నేతలు క్యాన్సిల్ అని చెప్పేశారు. అంతే కానీ దానిపై జనసేన తరపు నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడమే ఆశ్చర్యం. అంటే సినిమా కాల్షీట్లను నిర్మాతలకిచ్చినట్టే.. పొలిటికల్ కాల్షీట్లను పవన్ బీజేపీకి సమర్పించుకున్నారనమాట. 

ఇక పవన్ ని ఏ రేంజ్ లో వాడుకోవాలో కూడా బీజేపీ నేతలు డిసైడ్ చేసుకున్నట్టున్నారు. హైదరాబాద్ లో జరిగిన భారతమాత మహా హారతి కార్యక్రమం సహా.. బీజేపీ కార్యక్రమాలన్నిటిలో జనసేనానిని ఓ రేంజ్ లో వాడుకుంటున్నారు. అంటే ఇక పవన్ విచక్షణ ఏదీ ఉండదన్నమాట. ఏ కార్యక్రమం చేయాలన్నా, ఏ సమస్యపై స్పందించాలన్నా బీజేపీ హై కమాండ్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సిన దుస్థితి. వారు చేయమంటే చేయాలి, ఆగమంటే ఆగాలి. అంటే కీ ఇస్తే పనిచేసే బొమ్మలా మాత్రమే ఇక పవన్ తెలుగు ప్రజలకు కనిపిస్తారు. 

పవన్ పొలిటికల్ స్పీచ్ లో కూడా ఇకపై జోరు తగ్గుతుందనే అంటున్నారంతా. సొంత కార్యక్రమాలతో ఇన్నాళ్లూ హడావిడి చేసిన పవన్, ఇక బీజేపీతో కలసి చేసే పసలేని పోరాటాలతో మరింత దిగజారిపోతారనమాట. మొత్తమ్మీద బీజేపీతో పొత్తు పవన్ ఉనికికే ప్రమాదంగా మారింది. కేవలం ఢిల్లీకి వెళ్లి ఫొటోలు దిగడం మినహా.. గల్లీలో హవా చూపించడానికి పనికిరాకుండా పోయింది.

సైరా లాస్ ఎంత?