కల్కి.. భారతీయుడు 2.. పుష్ప 2 ఇవన్నీ ఫిక్స్ అయిపోగా మిగిలిన నెలలు.. నాలుగు. సెప్టెంబర్.. అక్టోబర్.. నవంబర్.. డిసెంబర్. ఈ ఏడాది మిగిలిన సినిమాలకు మిగిలిన టైమ్.
ఎన్టీఆర్- కొరటాల శివ కాంబో దేవర సినిమా, నాని సరిపోదా శనివారం, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కు మిగిలిన టైమ్. బాలయ్య- బాబీ సినిమా, రవితేజ- పీపుల్స్ మీడియా, చైతన్య- చందు మొండేటి… తండేల్.. దుల్కర్ సల్మాన్ – వెంకీ అట్లూరి, ధనుష్- శేఖర్ కమ్ముల నితిన్ రెండు సినిమాలు.. శర్వానంద్ ఒక సినిమా.. అల్లరి నరేష్ బచ్చల మల్లి, ఇలా దాదాపు పది సినిమాల వరకు ఈ నాలుగు నెల్లలోనే సద్దు కోవాలి.
అంటే సగటున ప్రతి నెల రెండు మిడ్ రేంజ్ సినిమాలు. అందులోనూ ఈ నాలుగు నెలలూ బాగా వర్కవుట్ అయ్యే నెలలు కాదు. వర్షాల సమస్యలు వుంటాయి. అందువల్ల మళ్లీ ఒకదాని మీద మరో సినిమా వేసేసుకోవాల్సిన పరిస్థితి. గ్యాప్ ఇవ్వకుండా విడుదలలు ప్లాన్ చేసేసుకోవాల్సి వచ్చినా రావచ్చు.
అయితే ఇక్కడ ఇంకో సమస్య కూడా వుంది ఈ సినిమాల్లో దాదాపు 90 శాతం సినిమాలకు మార్కెటింగ్ పూర్తి కాలేదు. అలా అని ఈ ఆరు నెలల్లో అయిపోతాయి అని అనుకుంటే, డిజిటల్ కంపెనీలు ఎన్ని సినిమాలు అని ఈ నాలుగు నుంచి ఆరు నెలల్లో సర్దుకుంటాయి అన్నది అనుమానం. పెద్ద సినిమాలకు చోటిస్తూ, మార్కెటింగ్ చూసుకుంటూ, డేట్ లు సెట్ చేసుకుంటూ, ఎన్ని సినిమాలు ఈ ఏడాది సక్సెస్ ఫుల్ గా విడుదల అవుతాయో చూడాలి.