హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కు మరో ఆకర్షణ తోడు కాబోతోంది. నాలుగున్నర ఎకరాల ప్లేస్ లో ఓ మాంచి డ్రైవ్ ఇన్ థియేటర్ ను తయారు చేయబోతున్నారు. ఈ మేరకు జిఎమ్మార్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు ముగ్గురు హీరోలు. ఈ ఓపెన్ థియేటర్ పేరు ఎ ఎమ్ బి క్లాసిక్.
ఆసియన్ సంస్థ సునీల్, హీరోలు రానా, వెంకీ, మహేష్ కలిసి ఈ ఓపెన్ డ్రైవ్ ఇన్ థియేటర్ ను నిర్మించబోతున్నారు. ఇందులో ఓ చిన్న సిటింగ్ ఎన్ క్లోజర్ కూడా వుంటుంది. ఓపెన్ ఫుడ్ కోర్టు కూడా వుంటుంది.
ఎ ఎమ్ బి థియేటర్ ను డిజైన్ చేసిన ముంబాయి ఆర్కిటెక్ట్ నే ఈ ఓపెన్ ఎయిర్ థియేటర్ ను కూడా డిజైన్ చేస్తున్నారు. ఈ ఏడాది దసరా లోగానే ఈ థియేటర్ అందుబాటులోకి వచ్చే అవకాశం వుంది.