నిత్యానంద మజాకా.. ఐరాసలో ‘కైలాస’ ప్రతినిధులు

అత్యాచార ఆరోప‌ణ‌ల‌తో దేశం విడిచి ప‌రారీలో ఉన్న వివాదాస్ప‌ద స్వామి నిత్యానంద మ‌రోసారి వార్త‌లో నిలిచారు. దేశం విడిచి పారిపోయిన నిత్యానంద త‌న‌కు త‌ను దేవుడిగా ప్ర‌క‌టించుకొని సొంత‌గా ఓ దేశాన్నే సృష్టించుకున్నారు. ఇప్పుడు…

అత్యాచార ఆరోప‌ణ‌ల‌తో దేశం విడిచి ప‌రారీలో ఉన్న వివాదాస్ప‌ద స్వామి నిత్యానంద మ‌రోసారి వార్త‌లో నిలిచారు. దేశం విడిచి పారిపోయిన నిత్యానంద త‌న‌కు త‌ను దేవుడిగా ప్ర‌క‌టించుకొని సొంత‌గా ఓ దేశాన్నే సృష్టించుకున్నారు. ఇప్పుడు ఆ దేశం నుండి ఐక్య‌రాజ్య‌స‌మితిలో జ‌రిగిన స‌మావేశానికి ఆ దేశ‌ ప్ర‌తినిధి హాజర‌వ‌డంతో అంద‌రిని అశ్చ‌ర్యంలో ముంచెత్తింది.

నిత్యానంద దేశం కైలాస ప్ర‌తినిధిగా విజ‌య‌ప్రియ నిత్యానంద అనే మ‌హిళ యుఎన్ఓ స‌మావేశంలో మాట్లాడుతూ.. 'హిందువులకు మొదటి సార్వభౌమ దేశం కైలాసమని, దీనిని నిత్యానంద పరమశివం స్థాపించారని, ప్రపంచం నలుమూలల నుండి తరిమివేయబడిన హిందువులచే కైలాస‌ స్థాపించబడింద‌ని.  కైలాసాన్ని అతిపెద్ద హిందూ దేశంగా అభివర్ణించారు. అలాగే భారత్ పై విమ‌ర్శ‌లు కురిపించారు.'

నిత్యానంద భారతదేశంలో అనేక కేసుల్లో వాంటెడ్ గా ఉన్నాడు. అతనిపై నమోదైన కేసుల్లో అత్యాచారం, పిల్లల అపహరణ-అత్యాచారం, దోపిడీ కేసులు ఉన్నాయి. 2019లో దేశం విడిచి పారిపోయిన నిత్యానంద ఈక్వెడార్ సమీపంలోని ఓ చిన్న ద్వీపంలో ఓ సొంత దేశాన్నే సృష్టించుకున్నారు.  కొన్ని నెలల క్రితం నిత్యానంద స్వామి చనిపోయారంటూ వార్తలు కూడా వచ్చాయి. ఆ త‌ర్వాత తాను చనిపోలేదని సమాధిలో(సుప్తావస్థ) ఉన్నానని నిత్యానంద ప్రకటించారు.