సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ ఏం చేసినా విలక్షణంగానే వుంటుంది. అందరు సెలబ్రిటీలు కరోనా టైమ్ లో ఇంటిపనులు చేస్తూ విడియోలు పెట్టారు. దేవీ కూడా లోడ్ చేసాడు.కానీ ఆ తేడా కనిపిస్తుంది. అక్కడితో ఆగలేద. మూన్ అంటూ ఓ చిన్న విడియో తయారుచేసి వదిలాడు. మబ్బులు కమ్మిన ఆకాశం అలా వుండిపోదు. మళ్లీ చంద్రుడు మెరుస్తాడు అంటూ ఓ పాజిటివ్ అందంగా చెప్పాడు.
అప్పుడే దేవీతో ఓ మాట కలిపి, లాక్ డౌన్ లో ఏం చేస్తున్నారో అని ప్రశ్నిస్తే.. 'అసలు లాక్ డౌన్ ఏమిటి? 24 గంటలు చాలడం లేదు…చేస్తున్న సినిమాల రీ రికార్డింగ్ లు, ట్యూన్ లు ఇలా చాలా.. వుంది వ్యవహారం. అదీ కాక నేను ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా కనిపించిన వాయిద్య పరికరం కనిపించినట్లు కొనేస్తుంటాను. అవన్నీ నేర్చుకోవాలని ఆశ. కానీ వీలు పడడం లేదు. ఇదిగో ఇప్పుడు వాటి పని కూడా పడుతున్నా…'' అంటూ బదులు వచ్చింది.
కొత్త సినిమాలు అంటున్నారు ఉప్పెన నుంచి రెండు పాటలు ఇచ్చారు, మూడోది ఎప్పుడు అంటే…''వదలాలి. కరోనా వచ్చి ఆపేసింది. విడుదల తేదీ సెట్ అయితే అప్పుడు వుంటుంది. సినిమా మాత్రం సూపర్ గా వచ్చింది. ఆర్ఆర్ చేస్తుంటే వస్తున్న ఫీల్ నే చెబుతోంది ఆ సినిమా సూపర్ అని…''
రంగ్ దే సంగతులేమిటి అంటే…''ఆ సినిమా పాటలు యూత్ కు సంగీత ప్రియులకు భలే పట్టేస్తాయి. ఎందుకంటే ఆ సినిమా రొమాంటిక్ సబ్జెక్ట్ అలాంటిది…'' అనేసారు.
ఇంతకీ పవర్ స్టార్ సినిమాకు మళ్లీ వర్క్ చేస్తున్నారు అటగా.. అని అడిగితే…'' అది అధికారికంగా చెబితేనే బాగుంటుంది. నేను చెబితే బాగుండదు…'' అంటూ తప్పుకున్నారు.
సరే, ఇవన్నీ ఒకె మరి పెళ్లి సంగతి ఏమిటీ అంటే…'' దానికి నా దగ్గర రెడీమేడ్ లేబుల్ ఆన్సర్ వుంది. ఆ ఒక్కటీ అడక్కు అన్నదే ఆ ఆన్సర్…'' అంటూ చమక్కు విసిరారు.
ఎందుకలా? అనకూడదు, అడక్కూడదు కానీ, కొంపదీసి లవ్ ఫెయిల్యూర్ లాంటిదేమైనా వుందా ఏంటీ? అని అంటే….''నాకా ఫెయిల్యూర్స్ నా? నాకు నో ఫెయిల్యూర్స్…నా రిక్వెస్ట్ ఒక్కటే పెళ్లి గురించి అడగకండి. ఒకరు అడిగారంటే ఇక అందరూ అదే తరహా ప్రశ్నలతో లైన్ కట్టేస్తారు. అందుకే..ఆ ఒక్కటీ అడక్కండి…అంటూ నవ్వేసారు దేవీశ్రీప్రసాద్.