ఆ రెండు టైటిళ్లు ఇవేనా?

రేపు.. సంక్రాంతికి రెండు పెద్ద అప్ డేట్ లు రాబోతున్నాయి. మెగాస్టార్.. యువి.. వశిష్ణ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్… మారుతి-ప్రభాస్-పీపుల్స్ మీడియా సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్. ఈ రెండు సినిమాలు చాలా…

రేపు.. సంక్రాంతికి రెండు పెద్ద అప్ డేట్ లు రాబోతున్నాయి. మెగాస్టార్.. యువి.. వశిష్ణ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్… మారుతి-ప్రభాస్-పీపుల్స్ మీడియా సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్. ఈ రెండు సినిమాలు చాలా సైలంట్ గా మొదలుపెట్టి, షూట్ చేసుకుంటూ వెళ్తున్నారు. మెగాస్టార్ సినిమా సంగతి పక్కన పెడితే మారుతి సినిమా ను చాలా అంటే చాలా సైలంట్ గా ఓ నలభై శాతం వరకు పూర్తి చేసారు. అయినా ఏమీ ఒక్క మాట లేదు.. పలుకులేదు.

మొదట్లో ఈ సినిమా మీద చాలా మందికి చిన్నచూపు వుంది. కానీ తరువాత తరువాత ప్రభాస్ ఫ్యాన్స్ కు ఈ సినిమా మీదే నమ్మకాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే మారుతి సినిమా గ్రౌండ్ ను వదిలి సాము చేయదు. ఫ్యాన్స్ కు ఏం కావాలో, ఎలా కావాలో లెక్కలు వేసుకుంటూ ముందుకు వెళ్తుంది. పైగా ఎంటర్ టైన్ మెంట్ అనేది ప్రభాస్ చేసి చాలా కాలం అయింది.

ఇంకో సంగతి ఏమిటంటే అటు మెగాస్టార్ సినిమా టైటిల్, ఇటు ప్రభాస్ సినిమా టైటిల్ ముందుగానే రకరకాలుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేసాయి. ప్రభాస్-మారుతి సినిమాకు ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ ముందుగా చక్కర్లు కొట్టింది. కొంత విమర్శ వచ్చింది. తరువాత రాజాసాబ్ అనే టైటిల్ వినిపించింది. దీనికి జనాల్లో పాజిటివ్ స్పందన వచ్చింది. మరే రేపు ఆ ‘రాజా సాబ్’ అనే టైటల్ నే అనౌన్స్ చేస్తారా? రాజాసాబ్ అన్న టైటిల్ బాగుంది. పాన్ ఇండియా టైటిల్ గా కూడా పనికి వస్తుంది. ఇదే అనౌన్స్ చేస్తారా? అన్నది చూడాలి.

మెగాస్టార్ సినిమాకు మొదటి నుంచీ ఒకటే టైటిల్ వినిపిస్తూ వస్తోంది. విశ్వంభర అన్నది ఆ టైటిల్. మాంచి పవర్ ఫుల్ గా వుందీ టైటిల్. మరి అదే ప్రకటిస్తారేమో వేచి చూడాలి.