ఎన్నికల ముందు పెద్ద డిమాండ్ పెట్టిన ముస్లిమ్స్…!

ఈసారి ఎన్నికల్లో తమకు ఎక్కువ సీట్లు కేటాయించాలని ముస్లిమ్స్ కోరుతున్నారు. అలా ఇచ్చిన పార్టీకే తమ మద్దతు ఉంటుందని చెబుతున్నాయి. విశాఖలో వాయిస్ ఆఫ్ ముస్లిమ్స్ కమిటీ రౌండ్ టేబిల్ సమావేశం జరిగింది. Advertisement…

ఈసారి ఎన్నికల్లో తమకు ఎక్కువ సీట్లు కేటాయించాలని ముస్లిమ్స్ కోరుతున్నారు. అలా ఇచ్చిన పార్టీకే తమ మద్దతు ఉంటుందని చెబుతున్నాయి. విశాఖలో వాయిస్ ఆఫ్ ముస్లిమ్స్ కమిటీ రౌండ్ టేబిల్ సమావేశం జరిగింది.

ఈ సమావేశం కీలక తీర్మానాలను ఆమోదించింది. ఏపీలో ముస్లిమ్స్ ప్రభావితం చేసే నియోజకవర్గాలు రాయలసీమ నుంచి శ్రీకాకుళం దాకా ఉన్నాయని వాయిస్ ఆఫ్ ముస్లిమ్స్ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు.

అందువల్ల తమకు అత్యధికంగా సీట్లు కేటాయించాలని కోరుతున్నారు. ఉమ్మడి పదమూడు జిల్లాలాలో తమ ప్రాతినిధ్యం ఉండేలా సీట్లకు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీఅలకు వాయిస్ ఆఫ్ ముస్లిమ్స్ కమిటీ అప్పీల్ చేసింది.

చాలా ఎన్నికల నుంచి చూస్తూంటే ముస్లిమ్స్ కి అనేక రాజకీయ పార్టీలు సీట్లు ఇవ్వకుండా అన్యాయమే చేస్తున్నాయని కమిటీ ప్రతినిధులు విమర్శించారు. ఈసారి తాము చూస్తూ ఊరుకోమని తాము కోరినన్ని సీట్లు కేటాయించే పార్టీలకే మద్దతు ఇస్తామని స్పష్టం చేశాయి.

విశాఖ సౌత్ తో పాటు గోదావరి జిల్లాలు, క్రిష్ణా గుంటూరు, గ్రేటర్ రాయలసీమలలో ఎక్కువ సీట్లను వాయిస్ ఆఫ్ ముస్లిమ్స్ కమిటీ కోరుతోంది. విజయనగరం శ్రీకాకుళంలలో తమకు బలం ఉందని చెబుతోంది. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలకు తాము అప్పీల్ చేస్తామని అంటున్నారు.

విశాఖ సౌత్ లో ఒకే ఒకసారి ముస్లిం అభ్యర్ధి గెలిచారు. అది 1994 ఎన్నికల్లో మాత్రమే. దాన్ని ఎత్తి చూపుతూ దశాబ్దాలు గడచినా శ్రీకాకుళం నుంచి ఉభయ గోదావరి జిల్లాల వరకూ చూస్తే తమకు అసలు ప్రాతినిధ్యం లేదని ఎత్తి చూపుస్తున్నారు. ఈసారి తాడో పేడో తేల్చుకుంటామని అంటున్నారు.