ఆర్జీవీ..అరియానా…భలే ఫిలాసఫీ

గత కొన్నాళ్లుగా వార్తల్లో వున్న ఆర్జీవీ..అరియానా ఇంటర్వ్యూ వీడియో బయటకు వచ్చింది. భయపడినంత లేదు కానీ, భయపడాల్సినంతా వుంది. ఈ వీడియో పరమార్థం మొత్తం ఆర్జీవీ సెక్సువల్ ఫిలాసఫీని లోకానికి వెల్లడించడానికి ఉద్దేశించి చేసినట్లుంది. …

గత కొన్నాళ్లుగా వార్తల్లో వున్న ఆర్జీవీ..అరియానా ఇంటర్వ్యూ వీడియో బయటకు వచ్చింది. భయపడినంత లేదు కానీ, భయపడాల్సినంతా వుంది. ఈ వీడియో పరమార్థం మొత్తం ఆర్జీవీ సెక్సువల్ ఫిలాసఫీని లోకానికి వెల్లడించడానికి ఉద్దేశించి చేసినట్లుంది.  ఈ ఫిలాసఫీ ఆయనకే స్వంతం. ఇంటర్వ్యూలో ఈ పిలాసఫీ విని, తరించి, వావ్ అనే వాళ్లు కూడా బై మిస్టేక్ దాన్ని ఫాలో కాలేరు. 

ఇంటర్వూలో దొర్లిన ఆణిముత్యాలు చూద్దాం

మీ బుగ్గులు బాగున్నాయి అనడానికి మీ బూబ్స్ బాగున్నాయి అనడానికి ఏమిటి తేడా? అదేదో తప్పు అన్నట్లు మొదటి నుంచీ క్రియేట్ చేసారు. 

నాకు అమ్మాయిలు అంటే ఇష్టం. అమ్మాయిలను ఇష్టపడే అమ్మాయిలన్నా ఇష్టం. అమ్మాయిలను ఇష్టపడే అబ్బాయిలన్నా ఇష్టం. కానీ అబ్బాయిలను ఇష్టపడే అబ్బాయిలు మాత్రం నచ్చరు.

లెస్బియన్లు అన్నా నాకు ఇష్టమే. ఎందుకంటే అందమైన అమ్మాయి పక్కన మరో అందమైన అమ్మాయి..అంటే ఇద్దరు అందమైన అమ్మాయిలు కదా..అందుకే ఇష్టం.

ఇంటర్వ్యూకి గంట క్రితమే సెక్స్ చేసాను. ఇప్పుడు నిన్ను(అరియానా) చూస్తూనే లోలోపల సెక్స్ చేస్తున్నాను. సెక్స్ చేయడం అనేది ఓ భావన కూడా.

కేవలం సెక్స్ కోసమే అమ్మాయిలతో వుంటాను. రిలేషన్ పెట్టుకోను. అలా చేయడం వల్ల కేవలం అమ్మాయిల సమయం కేవలం గంట మాత్రమే తీసుకుంటాను. మిగిలిన 23 గంటలు వారికే వదిలేస్తాను. 

జీవితంలో నువ్వు కూడా ఒకే అబ్బాయితో స్టిక్ అయి వుండిపోతే సెక్స్ లోని వెరైటీని మిస్ అయినట్లే. నీ ఫిలాసఫీ తప్పు అని ఓ అయిదేళ్ల తరువాత నువ్వే వచ్చి చెబుతావు. 

సినిమాలు..ఓడ్కా..ట్విట్టర్..అమ్మాయిలు వీటీలో నా ఛాయిస్ అమ్మాయిలే. సినిమాలు ఎందుకు ఇష్టం అంటే అందులో అమ్మాయిలు వుంటారు కనుక.

ఇలాంటి ఆణిముత్యాలతో సాగింది ఆర్జీవీ..అరియానాల సెక్సీ ఇంటర్వ్యూ