మన్యానికి జగనన్న ఆన..

జగన్ మాట తప్పరు, మడమ తిప్పరు అని చెబుతారు. ఇపుడు అలాంటి ఒక హామీని ఆయన గాలికి వదిలేయకుండా గట్టిగా నిలబెట్టుకున్నారు. విశాఖ మన్యం అనగానే చాలా మందికి వెంటనే గుర్తుకు వచ్చేది బాక్సైట్…

జగన్ మాట తప్పరు, మడమ తిప్పరు అని చెబుతారు. ఇపుడు అలాంటి ఒక హామీని ఆయన గాలికి వదిలేయకుండా గట్టిగా నిలబెట్టుకున్నారు. విశాఖ మన్యం అనగానే చాలా మందికి వెంటనే గుర్తుకు వచ్చేది బాక్సైట్ గనులే.

బాక్సైట్ తవ్వకాలను జరిపి మన్యాన్ని చిద్రం చేసే రాజకీయం చాలా కాలంగా కొనసాగింది. దాని మీద గిరిజనుల పోరాటమూ సాగింది. మొత్తానికి జగన్ విపక్షంలో ఉన్నపుడు తాము అధికారంలోకి వస్తే  బాక్సైట్ తవ్వకాలను జరిపించే ప్రసక్తే లేదని హామీ ఇచ్చారు.

ఆ తరువాత దాని మీద జగన్ సర్కార్ జీవో ఇచ్చినా ఇంకా విపక్షాలు అనుమనాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. దీంతో తాజాగా మరో జీవోను జగన్ సర్కార్ రిలీజ్ చేసింది. దీని ప్రకారం మన్యంలో తవ్వకాలకు శాశ్వతంగా కత్తెర వేశారు. 

ఎవరైనా బరితెగించి అలా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసి మరీ తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. మొత్తానికి చూస్తుకుంటే బాక్సైట్ తవ్వకాల విషయంలో అతి పెద్ద అడ్డుకట్ట పడినట్లే. గిరిజనం జగన్ మాట మీద నమ్మకంగా ఉన్నారు. విపక్షాలు ఇకనైనా శాంతిస్తాయా లేదా అన్నది చూడాలి.