ఆవిరి… అవును 3

థ్రిల్లర్, హర్రర్ సినిమాలతో తనకంటూ ఓ మార్క్ తయారుచేసుకున్న దర్శకుడు రవిబాబు లేటెస్ట్ సినిమా ఆవిరి టీజర్ బయటకు వచ్చింది. టీజర్ 1 అని పేరు పెట్టినా, దేనికదే వుండేలా కట్ చేసినట్లు కనిపిస్తోంది.…

థ్రిల్లర్, హర్రర్ సినిమాలతో తనకంటూ ఓ మార్క్ తయారుచేసుకున్న దర్శకుడు రవిబాబు లేటెస్ట్ సినిమా ఆవిరి టీజర్ బయటకు వచ్చింది. టీజర్ 1 అని పేరు పెట్టినా, దేనికదే వుండేలా కట్ చేసినట్లు కనిపిస్తోంది. ఆవిరి అన్న పేరు పక్కన పెడితే, మళ్లీ అవును సినిమా సీన్లు చూసిన ఫీలింగ్ కలగడం అన్నది ప్రేక్షకుడి తప్పుకాదు. ఎందుకంటే ఈ టీజర్ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది.

ఓ పెద్ద ఇల్లు, ఇన్విజిబుల్ దెయ్యం, సిసి కేమేరా సీన్లు అన్నీ ఎలా వున్నాయి అంటే రవిబాబు సినిమాలు నచ్చేవారికి నచ్చేలా వున్నాయి అనే ఆన్సర్ వస్తుంది. లడ్డూబాబు, అదిగో సినిమాలతో నాన్ హర్రర్ జోనర్లు తనకు అచ్చిరావు అని రవిబాబు గ్రహించినట్లుంది. అందుకే మళ్లీ వెనక్కు వచ్చి, తనకు కలిసి వచ్చిన 'అవును' జోనర్ లోకి దిగిపోయారు.

మిగిలిన రెండు టీజర్లు వస్తే, ఈసినిమా ఏ మేరకు వైవిధ్యంగా వుంటుంది అన్నది లెక్క వేసుకోవచ్చు. ఈ సినిమాను దిల్ రాజు బ్యానర్ మీద విడుదల చేయడం ఈసారి విశేషం.