Advertisement

Advertisement


Home > Movies - Movie News

లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగుతెరపైకి అబ్బాస్?

లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగుతెరపైకి అబ్బాస్?

అబ్బాస్ గుర్తున్నాడా.. ఈ పేరు చెప్పగానే ఎవరికైనా ప్రేమదేశం సినిమా గుర్తొస్తుంది. ఆ తర్వాత చాలా సినిమాలు చేసినప్పటికీ మళ్లీ ఆ స్థాయిలో టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు ఈ నటుడు. అలా కొన్ని సినిమాలు చేసి, ఆ తర్వాత పూర్తిగా పరిశ్రమకు దూరమయ్యాడు. ప్రస్తుతం ఓ యాడ్ తో మాత్రమే టీవీల్లో కనిపిస్తున్నాడు.

ఇప్పుడీ నటుడ్ని మరోసారి టాలీవుడ్ కు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓ పెద్ద సినిమాలో కీలక పాత్ర కోసం అబ్బాస్ పేరును పరిశీలిస్తున్నారు. గోపీచంద్ హీరోగా నటిస్తున్న సినిమా ఇది.

శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ కీలక పాత్ర కోసం రాజశేఖర్ ను అనుకొని, ఆఖరి నిమిషంలో అతడు తప్పుకోవడంతో ఆయన స్థానంలో జగపతిబాబును తీసుకున్నారు. ఈ సినిమాలో మరో కీలక పాత్ర ఉంది. ఆ పాత్ర కోసం అబ్బాస్ పేరును పరిశీలిస్తున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో కీలక పాత్రల కోసం క్యారెక్టర్ ఆర్టిస్టుల డిమాండ్ చాలా ఉంది. పాత తరం నటీనటుల్ని వెదికిమరీ తమ సినిమాల్లోకి తీసుకొస్తున్నారు మేకర్స్. ఈమధ్య అలా కొంతమంది నటీనటులు తెరపైకొచ్చారు. 

రెమ్యూనరేషన్, పాత్రలపై ఎలాగూ డిమాండ్ చేసే స్టేజ్ లో లేడు కాబట్టి.. అబ్బాస్ కూడా టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?