మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ ఆచార్య ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ రిలీజైంది. సినిమా టైటిల్ పై సస్పెన్స్ లేకపోవడంతో కేవలం టైటిల్ డిజైన్ కోసం మాత్రమే అందరూ వెయిట్ చేశారు. ఇక చిరంజీవి ఫస్ట్ లుక్ పై అందరికీ భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే.. ఉగ్రరూపంలో కత్తిపట్టిన కామ్రేడ్ చిరంజీవి లుక్ ను ఫస్ట్ లుక్ కింద విడుదల చేశారు.
సినిమా నేపథ్యాన్ని మోషన్ పోస్టర్ లో చూచాయగా వివరించారు. ఓ చిన్న పల్లెటూరు, ఆ ఊరు మధ్యలో ఓ ఆలయం, ఊరి చివరి న్యాయం చెప్పే ధర్మస్థలి.. సరిగ్గా అదే ప్రాంతంలో దుష్టశిక్షణ చేస్తూ చేతిలో కత్తి పట్టుకొని చిరంజీవి. ఈ ఎలిమెంట్స్ తో ఆచార్య మోషన్ పోస్టర్ డిజైన్ చేశారు.
ఇక మోషన్ పోస్టర్ కు సంబంధించి మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చిరంజీవి-మణిశర్మ కాంబినేషన్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. ఆచార్య కూడా అదే గ్యారెంటీ ఇస్తోంది. మోషన్ పోస్టర్ కు మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం అదిరింది.
మరోవైపు సినిమా విడుదలపై ఉన్న సస్పెన్స్ ను కూడా మోషన్ పోస్టర్ ద్వారా తొలిగించే ప్రయత్నం చేశారు. ఆచార్య సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా రిలీజ్ చేయబోతున్నారు.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది.