ఆచార్య నైజాం భారీ రేటు?

కరోనా నేపథ్యంలో సినిమాల హక్కుల రేట్లు తగ్గుతాయి అనుకుంటే వ్వవహారం రివర్స్ లో వుంది. పెద్ద సినిమాలకు భారీ రేట్లు చెబుతున్నారు.  Advertisement కరోనా కన్నా ముందు వసూలు చేసిన ఫిగర్లు చూపించి, అంతకు…

కరోనా నేపథ్యంలో సినిమాల హక్కుల రేట్లు తగ్గుతాయి అనుకుంటే వ్వవహారం రివర్స్ లో వుంది. పెద్ద సినిమాలకు భారీ రేట్లు చెబుతున్నారు. 

కరోనా కన్నా ముందు వసూలు చేసిన ఫిగర్లు చూపించి, అంతకు మించి ఇస్తేనే సినిమా ఇస్తాం అంటున్నారు. దాంతో బిత్తరపోవడం బయ్యర్ల వంతు అవుతోంది. అయితే మీడియం సినిమాలకు ఇలా లేదు వ్యవహారం. అవి మాత్రం ముక్కీ, మూలిగీ రేటు తెచ్చుకోవాల్సి వస్తోంది. 

భీష్మ హిట్ తరువాత అయినా రంగ్ దే సినిమాను ఆంధ్ర తొమ్మిది కోట్ల రేషియోలో ఇవ్వాల్సి వచ్చింది. కరోనాకు ముందు 11 లెక్కన అయినా వస్తుందనుకున్నారు.  గోపీచంద్ సీటీమార్ సినిమాకు పది కోట్లకు పైగా ఆంధ్ర రేటు చెబుతుంటే జనాలు ముందు వెనుక ఆడుతున్నారు. నితిన్ చెక్ బిజినెస్ ఇంకా జరగాల్సి వుంది. 

కానీ ఆచార్య, పుష్ప లాంటి సినిమాల బిజినెస్ ఎంక్వయిరీలు మాత్రం ప్రారంభమైపోయాయి. 35 కోట్ల కు కాస్త అటుగానే ఈ రెండు సినిమాల నైజాం రేటు కోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

మెగాస్టార్, అలాగే బన్నీ గత సినిమాలు నైజాంలో మంచి వసూళ్లు సాగించడంతో ఈ మేరకు కోట్ చేస్తున్నారు. పైగా నైజాంలో ఇటీవల పోటీ పెరిగింది. దాంతో రేట్లు కాస్త గట్టిగానే పలుకుతున్నాయి.

ఎందుకు పెదవి విప్పాలి?

జగన్ కు వచ్చిన నష్టం ఏమిటి?