Advertisement

Advertisement


Home > Movies - Movie News

'ఆచార్య' వర్క్...'విహారి' వాయిదా

'ఆచార్య' వర్క్...'విహారి' వాయిదా

నాగశౌర్య నటించిన లేటెస్ట్ సినిమా కిృష్ణ..విృంద..విహారి.. ఈ నెల 20 న విడుదల కావాల్సిన సినిమా. కానీ వాయిదా తప్పడం లేదు. ఉరిమి ఉరిమి దేనిమీదో పడినట్లు..ఆచార్యకు బ్యాక్ గ్రవుండ్ స్కోర్ వ్యవహారం వెళ్లి వెళ్లి ఈ సినిమా మీద పడింది. 

ఆచార్య కు మణిశర్మ చేసిన బ్యాక్ గ్రవుండ్ స్కోర్ నచ్చక, అతని కుమారుడు మహతి స్వరసాగర్ చేత చేయించుకున్నారు దర్శకుడు కొరటాల. 

శౌర్య సినిమా కూడా మహతినే సంగీతం అందించాల్సి వుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పక్కన పెట్టి ఆచార్య వర్క్ ముందుగా ఫినిష్ చేయాల్సి వచ్చింది. మెగాస్టార్ సినిమా కనుక శౌర్య సినిమా నిర్మాతలు కూడా ఏమీ మాట్లాడేందుకు లేకపోయింది. తమ సినిమా విడుదల టైమ్ కు వర్క్ అయిపోతుందనుకున్నారు. కాలేదు.

దాంతో ఇప్పుడు సినిమాను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. బహుశా జూలైలో విడుదలయ్యే అవకాశం వుంది. శౌర్య-షెర్లే జంటగా నటించిన ఈ సినిమాలో రాధిక తదితరులు కీలకపాత్రలు పోషించారు. అనీష్ కృష్ణ దర్శకుడు. ఉష మాల్పూరి నిర్మాత.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?