భరత్ అనే నేను….ఏప్రిల్ 2018
సైరా….అక్టోబర్ 2019
దర్శకుడు కొరటాల సినిమా వచ్చి నాలుగేళ్లు అవుతోంది.
మెగాస్టార్ సినిమా విడుదలై రెండున్నరేళ్లు దాటుతోంది.
వీరి ఇద్దరి కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా ఆచార్య. ఎన్నో డేట్లు లు మారి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కు వచ్చింది. ఇప్పుడు ఆ డేట్ కు కూడా వస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి సందేహాలు ముసురుకోవడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి.
ఈ సినిమా రీషూట్లు నిన్న మొన్నటి వరకు జరుగుతూనే వున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ కు గట్టిగా నెల కూడా సమయం లేదు.
అలాగే ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా పోస్ట్ ప్రొడక్షన్ ఫుల్ స్పీడ్ లో జరగడం అంటే అంత సులువు కాదు.
ఇవన్నీ ఇలా వుంటే ఆర్ఆర్ఆర్ కన్నా ముందుగా చరణ్ నటించిన సినిమా రాకూడదనే కదా, ఫిబ్రవరి డేట్ కు వచ్చింది. ఇప్పుడు అదే ఆర్ఆర్ఆర్ రాకుండా ఆచార్య విడుదల వుంటుందా అన్నది అతి పెద్ద సందేహం.
ఇవేవీ కాకుండా ఫిబ్రవరి నాటికి కోవిడ్ కేసులు అరివీర భయంకరంగా పెరుగతాయని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అదే కనుక జరిగితే కచ్చితంగా వెనక్కు జరగాల్సిందే. మళ్లీ మార్చి నుంచి ఏప్రిల్ నడుమ సినిమాల వత్తిడి చూసుకుని డేట్ వేసుకోవాల్సి వుంటుంది.
మొత్తం మీద ఆచార్య అలా వెనక్కు వెనక్కు జరుగుతూనే వుంది.