Advertisement

Advertisement


Home > Movies - Movie News

సాఫ్ట్ హీరో నుంచి ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమా

సాఫ్ట్ హీరో నుంచి ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమా

సాఫ్ట్ మూవీస్ కు పెట్టింది పేరు నాగచైతన్య. మధ్యమధ్యలో మాస్-యాక్షన్ కథలు టచ్ చేసినా, అతడికి ఎక్కువగా గుర్తింపు వచ్చింది సాఫ్ట్ సినిమాలతోనే. ఇలాంటి హీరో ఇప్పుడు ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ ట్రై చేస్తున్నాడు. అదే కస్టడీ. కొద్దిసేపటి కిందట ఈ సినిమా టీజర్ రిలీజైంది.

పక్కా యాక్షన్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా తెరకెక్కిందనే విషయం టీజర్ చూస్తే అర్థమౌతుంది. నాగచైతన్య లుక్, మేనరిజమ్స్ అన్నీ సీరియస్ గా ఉన్నాయి. కథ ఏంటనే విషయాన్ని టచ్ చేయకుండా, జానర్ ను పరిచయం చేసే ఉద్దేశంతో టీజర్ ను కట్ చేసినట్టున్నారు.

టీజర్ మొత్తం యాక్షన్ కట్స్ చూపించడానికే ప్రయారిటీ ఇచ్చారు. నాగచైతన్య లుక్స్, యాక్షన్ బాగున్నాయి. మాస్ గెటప్ లో అరవింద్ స్వామి విలనీ కొత్తగా ఉంది. మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి

యాక్షన్ సినిమాలకు తనదైన టచ్ ఇచ్చే దర్శకుడు వెంకట్ ప్రభు, కస్టడీ సినిమాను కూడా మంచి యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించాడనే విషయం టీజర్ చూస్తే అర్థమౌతుంది. టీజర్ లో శరత్ కుమార్ ను కూడా చూడొచ్చు. యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కతీర్ సినిమాటోగ్రఫీ బాగున్నాయి.

కృతిశెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మించాడు. మే 12న నాగచైతన్య నటించిన కస్టడీ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?