విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా నారప్ప. వెంకటేష్ ను మాంచి యాక్షన్ మోడ్ లో చూసి చాన్నాళ్లయింది. నారప్ప సినిమా ఆ కోరిక తీర్చేలాగే వుంది.
తమిళ సినిమాను రీమేక్ చేస్తూనే, కాస్త వెంకీ ఇమేజ్ ను కూడా దృష్టిలో పెట్టుకున్నట్లు కనిపిస్తోంది విడుదలయిన ట్రయిలర్ చూస్తుంటే. ఈ నెల 20న అమెజాన్ లో రాబోతున్న ఈ సినిమా ట్రయిలర్ ను ఫుల్ యాక్షన్ మోడ్ లోనే కట్ చేసారు.
సినిమా మెయిన్ సబ్జెక్ట్ కు సంబంధించి ఒకటి రెండు డైలాగులు వేసారు. మిగిలిన ట్రయిలర్ అంతా నరుకులు..పరుగులే. టేకింగ్ పరంగా, కట్ చేసిన సన్నివేశాల పరంగా సినిమా అంతా ఉద్వేగంగా సాగినట్లు కనిపిస్తోంది.
బ్యాక్ గ్రవుండ్ స్కోర్ దానికి తోడయింది. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ తరహా సినిమా చేయడం ఇదే ప్రథమం. సురేష్ బాబు, కలైపులి థాను కలిసి ఈ సినిమాను నిర్మించారు.