దెబ్బకి ఎకౌంట్ క్లోజ్ చేసుకున్న బ్రహ్మాజీ

జోకు అనుకున్నది కాస్తా బ్రహ్మాజీకి పాములా చుట్టుకుంది. చివరికి తన ట్విట్టర్ ఎకౌంట్ ను డిలీట్ చేయాల్సి వచ్చింది. అవును.. సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనపై 24 గంటలుగా నడుస్తున్న ట్రోలింగ్ ను తట్టుకోలేకపోయాడు.…

జోకు అనుకున్నది కాస్తా బ్రహ్మాజీకి పాములా చుట్టుకుంది. చివరికి తన ట్విట్టర్ ఎకౌంట్ ను డిలీట్ చేయాల్సి వచ్చింది. అవును.. సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనపై 24 గంటలుగా నడుస్తున్న ట్రోలింగ్ ను తట్టుకోలేకపోయాడు. ఫలితంగా తన ట్విట్టర్ ఎకౌంట్ ను డిలీట్ చేశాడు.

హైదరాబాద్ వరదలపై తనదైన స్టయిల్ లో ఓ జోకు వేశాడు బ్రహ్మాజీ. “ఓ మోటారు బోటు కొనుక్కోవాలనుకుంటున్నాను. ఎవరైనా సలహా ఇవ్వండి” అంటూ పోస్ట్ పెట్టాడు. అతడి దృష్టిలో ఇది కేవలం ఓ చిన్న జోక్ మాత్రమే. కానీ వరదలతో ఇబ్బందిపడుతున్న హైదరాబాద్ జనాలు మాత్రం దీన్ని చాలా సీరియల్ గా తీసుకున్నారు. కొంతమంది బ్రహ్మాజీని తెలంగాణ ద్రోహి అంటూ నిందించారు కూడా.

ఊహించని విధంగా తనపై సోషల్ మీడియాలో మూకుమ్మడి దాడి జరగడంతో బ్రహ్మాజీ ఉక్కిరిబిక్కిరయ్యాడు. తను అలా ఎందుకు ట్వీట్ పెట్టాల్సి వచ్చిందో వివరిస్తూ, తన ఎకౌంట్ ను డిలీట్ చేశాడు.

వరదలకు బ్రహ్మాజీ అపార్ట్ మెంట్ లోకి కూడా నీళ్లు వచ్చాయి. కారు సెల్లార్ లోకి వెళ్లలేకపోయింది. దీంతో బ్రహ్మాజీ, అతడి కుమారుడు దగ్గర్లోని మరో అపార్ట్ మెంట్ లో కారు పార్క్ చేసి ఫ్లాట్ కు వెళ్లే ప్రయత్నం చేశారు.

కానీ వరద వల్ల అది సాధ్యం కాలేదట. చుట్టుపక్కల జనాల సహాయంతో అతి కష్టమ్మీద ఇంటికి చేరుకున్నారట. ఈ మొత్తం ఎపిసోడ్ ను దృష్టిలో పెట్టుకొని ఓ చిన్న జోక్ వేశానని, దాన్ని అంతా తప్పుగా అర్థం చేసుకున్నారని చెబుతున్నాడు బ్రహ్మాజీ.

బ్రహ్మాజీ ఏ ఉద్దేశంతో ట్వీట్ పెట్టినా, అది జనాల్లోకి మాత్రం నెగెటివ్ సెన్స్ లోనే వెళ్లింది. దీంతో గత్యంతరం లేక తన ట్విట్టర్ ఎకౌంట్ ను డిలీట్ చేశాడు బ్రహ్మాజీ.

అందుకే బిగ్ బాస్ కి వెళ్లొద్దనుకున్నా