జగన్ ను ఇండస్ట్రీ కలవగలదా?

వరద ప్రమాదం హైదరాబాద్ నే కాదు, ఆంధ్రను కూడా ఇంతో అంతో అతలా కుతలం చేసింది. వున్నట్లుండి తెలుగు హీరోలు ముందుకు వచ్చి తెలంగాణ సిఎమ్ సహాయ నిధికి విరాళాలు ప్రకటించారు. ఇది నిజంగా…

వరద ప్రమాదం హైదరాబాద్ నే కాదు, ఆంధ్రను కూడా ఇంతో అంతో అతలా కుతలం చేసింది. వున్నట్లుండి తెలుగు హీరోలు ముందుకు వచ్చి తెలంగాణ సిఎమ్ సహాయ నిధికి విరాళాలు ప్రకటించారు. ఇది నిజంగా సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే సమాజం అండగా పెరిగిన వారు ఆ సమాజానికి ఎంతో కొంత చేయడం అన్నది ఎప్పుడూ సంతోషమే.

అయితే కోవిడ్ టైమ్ లో మాదిరిగా ఈసారి తెలంగాణతో పాటు ఆంధ్రకు ఎటువంటి విరాళం ప్రకటించలేదు సినిమా జనాలు. ఈ విషయమై విమర్శలు వినిపిస్తున్నాయి. దీన్ని తెలుగుదేశం అనుకూల మీడియా మరో విధంగా టర్న్ చేస్తోంది. జగన్ నేరుగా విరాళాలు ఇవ్వండి అని కోరలేదట. అందుకే హీరోలు విరాళం ఇవ్వలేదట.

నిజానికి సినిమా ఇండస్ట్రీ అంతా భారీగా విరాళాలు ఇచ్చినా మహా అయితే పది నుంచి పదిహేను కోట్లు అవుతుంది. అంతకు మించి కాదు. నిజానికి కరోనా నేపథ్యంలో ఆంధ్ర ప్రభుత్వం అవసరం ఇండస్ట్రీకే వుంది.  థియేటర్ల కరెంట్ బిల్లుల రద్దు అన్నది ఇప్పటికీ ఇంకా తేలనే లేదు. ఇప్పుడు ఈ విధంగా కరెంట్ బిల్లుల రద్దును ఇండస్ట్రీ అడగగలదు? అది నిర్మాతలు, హీరోలకు సంబంధించినది కాకపోవచ్చు. కానీ ఆ మధ్య వెళ్లి అడిగింది ఇండస్ట్రీ జనాలే. 

ఇప్పుడు ఈ విరాళాల నేపథ్యంలో ఎవరు వెళ్లి ఇండస్ట్రీ కోసం కోరగలరు? అడగలేదు అందుకే విరాళాలు ఇవ్వలేదు అని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలు అన్నీ ఓ కొత్త కోణాన్ని ఇండస్ట్రీ మీద రుద్దుతున్న తరుణంలో, అలంకార్ ప్రసాద్ లాంటి వాళ్లు కరెంట్ బిల్లుల రద్దుపై ప్రభుత్వాన్ని నిలదీసేలా మాట్లాడుతున్న నేపథ్యంలో ఇండస్ట్రీ జనాలు మరోసారి జగన్ ను కలవగలరా? కలిసే అవకాశం వస్తుందా? చూడాలి.

అందుకే బిగ్ బాస్ కి వెళ్లొద్దనుకున్నా