విషాదం.. గుండెపోటుతో యువ‌ నటుడు మృతి!

తెలుగు చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. యువ న‌టుడు హ‌రికాంత్(33) గుండెపోటుతో మృతి చెందారు. ప‌లు చిత్రాల్లో చిన్న చిన్న పాత్ర‌లు చేసిన ఆయ‌న తాజాగా త‌రుణ్ భాస్క‌ర్ సినిమాలో ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఆ…

తెలుగు చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. యువ న‌టుడు హ‌రికాంత్(33) గుండెపోటుతో మృతి చెందారు. ప‌లు చిత్రాల్లో చిన్న చిన్న పాత్ర‌లు చేసిన ఆయ‌న తాజాగా త‌రుణ్ భాస్క‌ర్ సినిమాలో ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఆ సినిమా రిలీజ్‌కు ముందే హ‌ఠాత్తుగా న‌టుడు హ‌రికాంత్ మ‌ర‌ణించ‌డంతో చిత్ర బృందంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.

హ‌రికాంత్ ముందుగా రంగ‌స్థ‌ల న‌టుడిగా మంచి పేరు సంపాధించుకున్న త‌ర్వాత సినిమాల్లోకి వ‌చ్చారు. ఇన్ని రోజులు చిన్న చిన్న పాత్ర‌లు చేసిన ఆయ‌న ఇటీవ‌లే టాలెంటెడ్ డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తూ తెర‌కెక్కిస్తున్న కీడా కోలా చిత్రంలో ఓ కీల‌క పాత్ర చేశారు. రీసెంట్‌గా విడుద‌ల చేసిన టీజ‌ర్‌కు అనూహ్య స్పంద‌న వ‌చ్చింది. సినిమాపై అంచ‌నాలు ఏర్ప‌డ‌టంతో టీమ్ అంతా సంబ‌రాలు చేసుకుంటోంది.  ఇంత‌లోనే హ‌రికాంత్‌ తుది శ్వాస విడిచారు.

కాగా ‘పెళ్లిచూపులు’ , ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి సినిమాల‌తో ద‌ర్శ‌కుడిగా ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న త‌రుణ్ భాస్క‌ర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ‘కీడా కోలా’ మూవీ టీజర్ రెండు రోజుల క్రితమే విడుదలైన సంగతి తెలిసిందే. బ్ర‌హ్మానందం ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నారు. కామెడీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిన ఈ మూవీ త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.