టాలీవుడ్ లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్నట్టుంది. ఇప్పటికే పలువురు హీరోలు పెళ్లి చేసుకున్నారు. మెగా డాటర్ నిహారిక కూడా పెళ్లికి రెడీ అవుతోంది. ఇప్పుడీ లిస్ట్ లోకి నటుడు రాజా కూడా చేరిపోయాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి తనయుడు, నటుడు రాజా తన పెళ్లి మేటర్ బయటపెట్టాడు. అంతేకాదు.. ఎంగేజ్ మెంట్ కూడా పూర్తయింది.
“2020లో బెస్ట్ పార్ట్ ఇదే. జీవితంలో ఓ కొత్త ప్రయాణం కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అంటూ తన ఎంగేజ్ మెంట్ మేటర్ ను బయటపెట్టాడు రాజా. తన కాబోయే భార్యతో దిగిన ఫొటోల్ని షేర్ చేశాడు. అమ్మాయి డీటెయిల్స్ మాత్రం షేర్ చేయలేదు.
ఫిదా, అంతరిక్షం, ఏబీసీడీ, మిస్టర్ మజ్ను లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు రాజా. ఏపీసీడీ సినిమాలో విలన్ గా కూడా నటించాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో లీడింగ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న ఈ నటుడు.. ఇప్పుడు జీవితంలో మరో దశలోకి ఎంటర్ అవుతున్నాడు.