మొన్ననే జగత్ దేశాయ్, అమలాపాల్ కు ప్రపోజ్ చేశాడు. ఓ అందమైన రిసార్ట్ లో డాన్సర్ల మధ్య తను కూడా డాన్స్ చేస్తూ, హఠాత్తుగా జేబు లోంచి ఉంగరం తీసి, మోకాలిపై నిల్చొని అమలాపాల్ కు ప్రపోజ్ చేశాడు. ఆ వెంటనే అమలాపాల్ కూడా ఒప్పుకుంది. ఓ ముద్దు ఇచ్చి అంగీకారం తెలిపింది.
ఆ వీడియో ఇంకా చక్కర్లు కొడుతుండగానే, వీళ్లిద్దరూ ఒకటయ్యారు. అవును.. అమలాపాల్, జగత్ దేశాయ్ పెళ్లి చేసుకున్నారు. కొచ్చిలో వీళ్ల వివాహం జరిగింది. కొంతమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో అమలాపాల్ ను పెళ్లాడాడు జగత్.
తను, జగత్ పెళ్లి చేసుకున్నట్టు అమలాపాల్ స్వయంగా ప్రకటించింది. “రెండు మనసులు, ఒకటే గమ్యం, చేతిలో చేయి వేసి జీవితాంతం ప్రయాణం చేయబోతున్నాను” అంటూ కొన్ని పెళ్లి ఫొటోల్ని కూడా ఆమె షేర్ చేసింది.
నటి అమలాపాల్ కు ఇది రెండో వివాహం. ఇంతకుముందు ఆమె దర్శకుడు విజయ్ ను పెళ్లాడింది. అయితే ఆ రెండు కుటుంబాలకు పడలేదు. విజయ్ కుటుంబంతో పొసగక, ఆ తర్వాత విజయ్ తో కూడా అభిప్రాయబేధాలొచ్చి బయటకొచ్చేసింది అమలాపాల్.
అలా పెళ్లయిన రెండేళ్లకే విజయ్ కు దూరమైన ఈ హీరోయిన్, అప్పట్నుంచి సోలోగానే ఉంది. కొన్నాళ్ల కిందట రిసార్ట్ మేనేజర్ జగత్ కు కనెక్ట్ అయింది. కొచ్చిలోని గ్రాండ్ హయత్ హోటల్ లో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు.