భ‌ర్త‌తో క‌లిసి హీరోయిన్ కండోమ్ యాడ్ ప్ర‌మోష‌న్!

దేశంలో బాగా పాపుల‌ర్ టీవీ న‌టీమ‌ణుల్లో ఒక‌రు అనిత హ‌స్స‌నందిని. ప‌లు తెలుగు సినిమాల్లో న‌టించింది, తెలుగువాడినే పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ల కింద‌టి వ‌ర‌కూ రోజువారీగా అత్య‌ధికంగా చార్జ్ చేసే హిందీ టీవీ న‌టీమ‌ణుల్లో…

దేశంలో బాగా పాపుల‌ర్ టీవీ న‌టీమ‌ణుల్లో ఒక‌రు అనిత హ‌స్స‌నందిని. ప‌లు తెలుగు సినిమాల్లో న‌టించింది, తెలుగువాడినే పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ల కింద‌టి వ‌ర‌కూ రోజువారీగా అత్య‌ధికంగా చార్జ్ చేసే హిందీ టీవీ న‌టీమ‌ణుల్లో ముందు వ‌ర‌స‌లో నిలిచింది అనిత‌.

వివాహం, త‌ల్లిగా బిజీ అయ్యింది. సోష‌ల్ మీడియాలో త‌న ప‌ర్స‌న‌ల్, ఫ్యామిలీ ఫొటోల‌నూ, ఇత‌ర ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ తో అప్ డేట్స్ ఇస్తూ ఉంటుంది. ఆ సంగ‌త‌లా ఉంటే… అనిత ఒక కండోమ్ కంపెనీ లేటెస్ట్ మోడ‌ల్ కండోమ్స్ ను ప్ర‌మోట్ చేస్తోంది. ఆమె భ‌ర్తతో కలిసి ఈ ప‌ని చేస్తోంది.

ఆ కండోమ్స్ తో ఇంటెన్స్ ప్ల‌జ‌ర్ ఉంటుంద‌న్న‌ట్టుగా ఈ న‌టీమ‌ణి చెప్ప‌డం, ఈ భార్య‌భ‌ర్త‌ల చాట్ తో ఆ ప్రోమోను రూపొందించారు. ఆ కండోమ్ తో అద్భుత‌మైన అనుభ‌వం అన్న‌ట్టుగా అనిత లేడీస్ కు సూచిస్తోంది ఆ ప్రోమోలో. అంతే కాకుండా.. ఆ కండోమ్ టెలివిజ‌న్ క‌మ‌ర్షియ‌ల్ ను కూడా అనిత ఆ త‌ర్వాత త‌న అకౌంట్ లో పోస్టు చేసింది.

త‌మ ఇన్ స్టాగ్ర‌మ్ అకౌంట‌ర్ల‌లో తార‌లు ర‌క‌ర‌కాల బ్రాండ్ ల‌ను ప్ర‌మోట్ చేస్తూనే ఉంటారు. కాఫీ పొడితో మొద‌లుకుని.. అన్ని ర‌కాల వాటినీ వారు పెయిడ్ ప్ర‌మోట్ చేస్తూ ఉన్నారు. ఈ క్ర‌మంలో అనిత నిర్మొహ‌మాటంగా కండోమ్ ప్ర‌మోష‌న్ ను చేప‌ట్టిన‌ట్టుగా ఉంది. స్టార్ ఇమేజ్ ఉన్న తార‌లు.. మ‌ద్యం కంపెనీల అంబాసిడ‌ర్లుగా మార‌డం క‌న్నా ఇది వింత కాదేమో!