Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ హీరోకు సినిమా కష్టాలు.. అప్పు కోసం ప్రయత్నాలు

ఆ హీరోకు సినిమా కష్టాలు.. అప్పు కోసం ప్రయత్నాలు

టాలీవుడ్ లో చకచకా సినిమాలు తీసే హీరో అతడు. ఈమధ్య వచ్చిన ఓ సక్సెస్ తో రెమ్యూనరేషన్ కూడా పెంచాడు. అయితే నామమాత్రమే అనుకోండి, అది వేరే సంగతి. ఇప్పుడా హీరో సినిమా ఒకటి డైలమాలో పడింది. డబ్బుల్లేక ఆఖరి నిమిషంలో ఆగిపోయే పరిస్థితికి వచ్చింది.

ఓ కొత్త దర్శకుడ్ని పరిచయం చేస్తూ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు ఆ హీరో. ఈమధ్య మరో పెద్ద హీరోతో ఘనంగా టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అంతా ఓకే అనుకున్న టైమ్ లో నిర్మాత చేతులెత్తేశాడు. తనకు ఫైనాన్షియర్లు డబ్బులు ఇవ్వడం లేదని, సినిమా పూర్తి చేయలేనని చెప్పేశాడు.

నిర్మాత హ్యాండ్సప్ అనడంతో హీరో ఆ సినిమాను తన భుజాలపై వేసుకున్నాడు. మిగిలిన 20శాతం షూటింగ్ పూర్తిచేసి, సినిమాను సాఫీగా విడుదల చేసేందుకు పెట్టుబడిదారుల కోసం అన్వేషిస్తున్నాడు. ఇందులో భాగంగా తనకు తెలిసిన సౌండ్ పార్టీలకు ఫోన్లు చేస్తున్నాడు సదరు హీరో.

నిజానికి ఓ సినిమా ఆగిపోతే హీరోకు సంబంధం లేదు. పెద్ద పెద్ద హీరోల సినిమాలే ఆగిపోయిన సందర్భాలున్నాయి. కాకపోతే ఈ ఒక్క సినిమా మీద ఆ హీరో చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఆ సినిమాతో యాక్షన్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు. అందుకే తనే దగ్గరుండి ఇన్వెస్టర్లను వెదికే పని పెట్టుకున్నాడు.

గమ్మత్తైన విషయం ఏంటంటే.. ఫైనాన్షియర్లు లేరంటూ హీరోపై భారమేసిన ఆ నిర్మాత.. తాజాగా ఓ కొత్త హీరోతో కొత్త సినిమా ప్రారంభించాడు. చూస్తుంటే.. ఆ నిర్మాతకు, ఈ హీరోకు వ్యవహారం చెడినట్టుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?