రోగులకు ఆక్సిజన్ అందిస్తున్న హీరోయిన్

గతేడాది తొలిసారి కరోనా వచ్చిన టైమ్ లో హీరోయిన్లంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. టీవీ చూడడం, అందాన్ని పెంచుకోవడానికే ఎక్కువ టైమ్ కేటాయించారు. కానీ ఆ టైమ్ లో బయటకొచ్చి సేవలందించింది హీరోయిన్ ప్రణీత. …

గతేడాది తొలిసారి కరోనా వచ్చిన టైమ్ లో హీరోయిన్లంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. టీవీ చూడడం, అందాన్ని పెంచుకోవడానికే ఎక్కువ టైమ్ కేటాయించారు. కానీ ఆ టైమ్ లో బయటకొచ్చి సేవలందించింది హీరోయిన్ ప్రణీత. 

లాక్ డౌన్ టైమ్ లో ముఖానికి మాస్క్ పెట్టుకొని, ఎంతోమందికి ఆహారం అందించింది. ఇప్పుడు మరోసారి ఈ హీరోయిన్ తన ఛారిటీ కార్యక్రమాల్ని స్టార్ట్ చేసింది.

కరోనా సెకెండ్ వేవ్  మరింత తీవ్రంగా ఉండడంతో.. ఈసారి తన సేవా కార్యక్రమాల్ని ఇంకాస్త విస్తరించింది ప్రణీత. కేవలం అన్నార్తులకు ఆహారం అందించడంతోనే ఆగిపోకుండా.. ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల దిశగా కూడా తన సేవా కార్యక్రమాల్ని ఉధృతం చేసింది.

“మొదటి వేవ్ లో కమ్యూనిటీ కిచెన్ కాన్సెప్ట్ ను తీసుకొచ్చాం. అవసరమైన వాళ్లందరికీ ఆహారం అందించాం. సెకెండ్ వేవ్ లో కూడా ఏదో చేయాలనిపించింది. ఆహారం కంటే ఈసారి ఆక్సిజన్ అత్యవసరం అనిపించింది. అందుకే నా ఛారిటీ ద్వారా లక్ష రూపాయలు పోగు చేశాం. అవసరమైన వాళ్లకు ఆక్సిజన్ అందిస్తున్నాం.”

సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా మారిందని, తన వల్ల తన కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో మరిన్ని అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నానని తెలిపింది ప్రణీత. ఈ సంక్షోభ సమయంలో సెలబ్రిటీలంతా తమకు తోచిన రీతిలో సమాజానికి ఏదైనా మంచి చేయాలని పిలుపునిస్తోంది ఈ బ్యూటీ.