హాస్పిటల్ బెడ్ పై హీరోయిన్.. అసలు ఏమైంది?

ఉన్నట్టుండి హీరోయిన్ సునైన జబ్బు పడింది. ఆమె ఏకంగా హాస్పిటల్ లో జాయిన్ అయింది. కొంచెం టైమ్ ఇవ్వండి, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో బయటకొస్తానంటూ ప్రకటించిన ఈ హీరోయిన్.. హాస్పిటల్ బెడ్ పై పడుకున్న…

ఉన్నట్టుండి హీరోయిన్ సునైన జబ్బు పడింది. ఆమె ఏకంగా హాస్పిటల్ లో జాయిన్ అయింది. కొంచెం టైమ్ ఇవ్వండి, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో బయటకొస్తానంటూ ప్రకటించిన ఈ హీరోయిన్.. హాస్పిటల్ బెడ్ పై పడుకున్న ఫొటోల్ని పోస్ట్ చేసింది. ఆమె చేతికి సెలైన్ తగిలించి ఉంది. అంతేకాదు.. ఆమెకు ఆక్సిజన్ సపోర్ట్ కూడా అందిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం, ఆమె వైరల్ ఫీవర్ తో బాధపడుతోంది. ఒక రోజంతా ఇంట్లోనే రెస్ట్ తీసుకున్న ఆమె, రెండో రోజుకు మాత్రం హాస్పిటల్ లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది.

కొన్ని రోజుల కిందట ఆమె ఓ కొటేషన్ పోస్ట్ చేసింది. జీవితంలో కొంచెం ఎక్కువ జీవించడానికి ప్రయత్నించండి.. ఇష్టమైన పనులకు ఎక్కువ సమయం కేటాయించండి. కంఫర్ట్ జోన్ కు వెలుపల అడుగు పెట్టడానికి ట్రై చేయండి. ఎక్కువ జ్ఞాపకాల్ని దాచుకోవడానికి ఇష్టపడండి.. ప్రపంచం అందించే అనంతమైన అవకాశాల్ని అందుకోవడానికి ఎగరండి అంటూ స్ఫూర్తిదాయకంగా ఓ కొటేషన్ పెట్టింది. అలా పెట్టిన కొన్ని రోజులకే ఇలా హాస్పిటల్ బెడ్ పై చేరింది.

తెలుగులో రాజరాజ చోర సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది సునైన. అయితే గ్లామర్ పాత్రల కంటే నటించడానికి స్కోప్ ఉండే క్యారెక్టర్స్ కోసం ఆమె ఎక్కువగా ఎదురుచూస్తుంటుంది. అందుకే తెలుగులో ఆమెకు తక్కువగా అవకాశాలొస్తున్నాయి.