పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధిపతిగా తప్పటడుగులు వేసి వుండొచ్చు.వేస్తూ వుండొచ్చు. కానీ హీరోగా ఆయనకు వున్న క్రేజ్ వేరు. క్రౌడ్ పుల్లింగ్ స్టామినా వేరు. ఆఫ్ కోర్స్..అజ్ఞాతవాసి దీనికి మినహాయింపు అనుకోండి. రాజకీయాలకు కామా పెట్టి, మళ్లీ సినిమాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ వకీల్ సాబ్ సినిమాను చకచకా ఫినిష్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో రామోజీ ఫిలిం సిటీలో క్లయిమాక్స్ దృశ్యాలు చిత్రీకరిస్తున్నారు. క్లయిమాక్స్ లో వచ్చే కోర్టు సీన్ లో దాదాపు ఒకటిన్నర నిమషానికి పైగా వుండే లెంగ్తీ డైలాగును పవన్ చెప్పాల్సి వుంది. ఆడపిల్లలు, అక్క చెల్లెళ్లు, వాళ్లకు ఇవ్వాల్సిన హక్కులు ఇవన్నీ కలగలిసిన డైలాగు అది.
ఇంత లెంగ్తీ డైలాగును పెర్ ఫెక్ట్ గా సింగిల్ టేక్ లో చెప్పి, అన్ని విధాలా సూపర్ అనిపించుకున్నాడట పవన్. ఆ టైమ్ లో స్పాట్ లో వున్నవారంతా పవన్ డైలాగ్ టైమింగ్, యాక్టింగ్ సింక్ కు సూపర్ అన్నారట. అయినా, రాజకీయ వేదికల మీద భారీ భారీ మాటలు అనాయాసంగా పలికేయడం అలవాటు అయిన తరవాత, ఇక సినిమా డైలాగులు చెప్పడానికి సమస్య ఏమిటి? దిల్ రాజు నిర్మిస్తున్న వకీల్ సాబ్ కు శ్రీరామ్ వేణు దర్శకుడు.