అదే నాగ్..అదే ఓల్డ్ స్టైల్

రోజుకో స్టైల్ మార్చాల్సిన కాలం ఇది. అలాంటిది అయిదు సీజన్ ల బట్టీ అదే నాగ్ మొహాన్నే చూడాల్సి వస్తోంది మా టీవీ బిగ్ బాస్ లో. పోనీ అదయినా కాస్త కొత్తగా ట్రయ్…

రోజుకో స్టైల్ మార్చాల్సిన కాలం ఇది. అలాంటిది అయిదు సీజన్ ల బట్టీ అదే నాగ్ మొహాన్నే చూడాల్సి వస్తోంది మా టీవీ బిగ్ బాస్ లో. పోనీ అదయినా కాస్త కొత్తగా ట్రయ్ చేయడం వుంటుందా? అంటే అదీ కాదు. అదే నవ్వు, అదే స్వకుచమర్దనం..తను, తన పిల్లలు, తన సినిమాల పాటలు. పొగిడించుకోవడం. బిగ్ బాస్ వేదిక మీద అదే రిపీట్ అయింది నిన్నటికి నిన్న. 

పైగా బిగ్ బాస్ 4 కు కాస్త క్రేజ్ వచ్చింది. చాలా మంది యూ ట్యూబర్లు, యాంకర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు తెగ తాపత్రయపడ్డారు బిగ్ బాస్ హౌస్ లోకి రావడానికి. కానీ మరి ఎవరు ఎంపిక చేసారో? ఎవరు రికమెండ్ చేసారో? ఎవరు ప్రిలిమినరీ ఫిల్టర్ చేసారో? కానీ స్టార్ మా చూసే కామన్ ప్రేక్షకులకు అస్సలు పట్టని ఫేస్ లే చాలా వరకు. పల్లెటూళ్ల ప్రేక్షకులకు అయితే అస్సలు అనుమానమే.

పైగా కొంతమంది సెలబ్రిటీలు వేసుకువచ్చిన డ్రెస్ లు చూస్తే మరీ డ్రామా డ్రెస్ కంపెనీల్లో తెచ్చుకువచ్చారా? అన్న చిన్న అనుమానం. పైగా 'మింగేయ్' అనే అసహ్యపు డబుల్ మీనింగ్ డైలాగులు. వీటిని చూసి నాగ్ ముసి ముసి నవ్వులు నవ్వడం. ఇలాంటివి ఇంకా ఎన్ని వినాల్సి వస్తుందో? సదరు పార్టిసిపెంట్ నోటి వెంట హౌస్ లో అని తలచుకుంటేనే భయం వేస్తుంది. 

థర్డ్ గ్రేడ్ యూ ట్యూబ్ చానెల్ ను గుర్తించి, బిగ్ బాస్ హౌస్ లోకి పిలిపించారు అంటే చాలు స్టార్ మా చానెల్ ఎంత కంటెస్టంట్ కరువులో వుందో. మొత్తం మీద బిగ్ బాస్ తోలి రోజు..ఈ బోర్ ..ఈ ల్యాగ్..చాలా..ఇంకా కొంచెం కావాలా?  అన్నట్లు సాగింది.