Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఆదిపురుష్ కు మరో హోల్ సేల్ బేరం!

ఆదిపురుష్ కు మరో హోల్ సేల్ బేరం!

ఆదిపురుష్ లెక్కలు రోజు రోజుకు భలే మలుపులు తిరుగుతున్నాయి. ఉన్నట్లుండి 185 కోట్లకు (జిఎస్టీతో కలిపి) మేరకు తెలుగు రాష్ట్రాల హక్కులు విక్రయించిన వార్తనే ఓ సంచలనం. ఇంత రేటు ఈ సినిమాకు పలుకుతుందా? కొనుగోలు చేసిన పీపుల్స్ మీడియా స్ట్రాటజీ ఏమిటి అన్నది ఓ ప్రశ్న. దీంతో అసలు నైజాం ఎంతకు ఇస్తారు..ఆంధ్ర ఎంతకు ఇస్తారు ఇలాంటి లెక్కలు అన్నది టాలీవుడ్ లో వినిపించడం మొదలైంది.

ఇలాంటి నేపథ్యంలో ఆంధ్ర ఏరియాకు ఓ మాంచి హొల్ సేల్ బేరం పీపుల్స్ మీడియా ఆఫీసు తలుపు తట్టినట్లు తెలుస్తోంది. వెస్ట్ కు చెందిన ఉషా ఫిలిం పంపిణీ సంస్థ మరి కొందరితో కలిసి ఆంధ్రకు హొల్ సేల్ గా తీసుకోవడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈస్ట్ అనుశ్రీ ఫిలింస్ కూడా వీరితో జాయిన్ అయినట్లు భోగట్టా.

వీరంతా కలిసి ఆంధ్ర ఏరియా ను 60 నుంచి 65 కోట్లకు హోల్ సేల్ గా ఇవ్వమని, కానీ కనీసం ఇరవై శాతం రికవరీ పెట్టాలని అడిగినట్లు తెలుస్తోంది.అంటే 50 కోట్లు నాన్ రికవరబుల్ అడ్వాన్స్, 15 కోట్లు రికవరబుల్ అడ్వాన్స్ అన్నమాట. అప్పుడు కొనుగోలు దారులకు పెద్దగా రిస్క్ వుండదు. పెద్ద సినిమా 50 కోట్ల రేంజ్ అంటే ఫరవాలేదు. కానీ పీపుల్స్ మీడియాకు రిస్క్ వుంటుంది.

అందుకే ఈ బేరం ముందుకు వెళ్లకుండా ఇంకా ప్రపోజల్ స్థాయిలోనే వుండిపోయినట్లు తెలుస్తోంది.ఆంధ్ర నుంచి 70 కోట్ల మేరకు నాన్ రికవరబుల్ అడ్వాన్స్ రావాల్సి వుంటుందనే ఆలోచనలో పీపుల్స్ మీడియా వున్నట్లు తెలుస్తోంది.

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా