Advertisement

Advertisement


Home > Movies - Movie News

ప్రభాస్-మారుతి-రెండు భాగాలు-గుడ్ జోక్

ప్రభాస్-మారుతి-రెండు భాగాలు-గుడ్ జోక్

అదిగో సినిమా అంటే ఇదిగో రెండు భాగాలు అనడం కామన్ అయిపోయింది. ప్రతి భారీ సినిమా మీద రెండు భాగాల గ్యాసిప్ లు వున్నాయి. ఇలా రెండు భాగాలు గ్యాసిప్ లేని సినిమా మారుతి-ప్రభాస్ కాంబినేషన్ లో పీపుల్స్ మీడియా నిర్మిస్తున్నది ఒక్కటే. 

ఇప్పుడు దాని మీద కూడా గ్యాసిప్ లు ప్రారంభమయ్యాయి. రెండు భాగాలు అంటూ. ప్రభాస్ ప్రాజెక్ట్ కె రెండు భాగాలు అని గ్యాసిప్ లు వున్నాయి. కాదు ఫ్రాంజైస్ లు గా వస్తుంది అని టాక్ వుంది. ప్రభాస్ సలార్ సినిమా రెండు భాగాలు అని టాక్ వుంది. అది ఇప్పటికీ ఇంకా ఏ విషయం తేలలేదు.

ఇలా ప్రతి సినిమా రెండు భాగాలు అనడం లేదా, సినిమా చివరిలో చిన్న హింట్ ఇచ్చి సీక్వెల్ వుందని ప్రేక్షకుల ఊహకు వదిలేయడమో కామన్ గా మారింది. అలాంటి విధంగానే మారుతి-ప్రభాస్ సినిమా కూడా రెండు భాగాలు అనే గ్యాసిప్ ను పుట్టించి వుండొచ్చు.

కానీ విశ్వసనీయవర్గాల భోగట్టా ప్రకారం ఇది సింగిల్ పార్ట్ సినిమానే. ముందు అదే పెర్ ఫెక్ట్ గా, టైమ్ కు తీసి సమ్మర్ వేళకు విడుదల చేయగలిగితే చాలు అనే భావనలో వుంది యూనిట్. అందువల్ల ఈ సినిమా కూడా రెండు భాగాలు అనే టెన్షన్ ఏమీ అవసరం లేదు ప్రభాస్ ఫ్యాన్స్ కు. సలార్ రెండు భాగాలు అవుతుందేమో? ప్రాజెక్ట్ కె ఫ్రాంచైజీ గా మారుతుందేమో? కానీ మారుతి సినిమా సింగిల్ సినిమానే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?