Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఆదిపురుష్ ఓకె..సలార్..ప్రాజెక్ట్ కె!

ఆదిపురుష్ ఓకె..సలార్..ప్రాజెక్ట్ కె!

నడుస్తున్నది మే నెల. సంక్రాంతి జనవరిలో. అంటే ఎనిమిది నెలల సమయం. ఆదిపురుష్-సలార్-ప్రాజెక్ట్ కె.. మూడు సినిమాలు. ఎనిమిది నెలల గ్యాప్ లో మూడు పాన్ ఇండియా సినిమాలు..అంటే దాదాపు 1500 కోట్ల వ్యయంతో నిర్మించిన మూడు సినిమాలు. విడుదల సాధ్యమేనా? ఇదీ కాస్త లాజికల్ గా వినిపిస్తున్న ప్రశ్న.

ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్-సలార్ దాదాపు పూర్తి కావచ్చాయి. ఆదిపురుష్ విడుదల దగ్గరకు వచ్చేసింది. ప్రమోషన్ వర్క్ మొదలయింది. సో..ఆ సినిమా విడుదల పక్కా. రెండవ సినిమా సలార్. సెప్టెంబర్ 27 విడుదల. జూన్ లో ఆదిపురుష్ వస్తే, పూర్తిగా మూడు నెలల గ్యాప్ లో మరో సినిమా. సేమ్ హీరో ది విడుదల చేయాల్సి రావడం అంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే.

రెండూ వేరు వేరు జానర్లు. ఇది పౌరాణికం అది ఫుల్ యాక్షన్ అని అనుకుంటే మరో మూడు నెలల గ్యాప్ లో ప్రాజెక్ట్ కె. ఇది మరీ భారీ సినిమా ఆదిపురుష్, సలార్ ల కన్నా ఖర్చు ఎక్కువ సినిమా. దానికి సంక్రాంతి నే సరైన డేట్. అందుకే దానికే ఫిక్స్ అయ్యారు.

ఇక్కడ గమ్మత్తేమిటంటే ఒక్కో పాన్ ఇండియా సినిమాకు తన వంతు ప్రచారం చేయడానికైనా హీరో ఒక్కొదానికి కనీసం 15 రోజుల వంతున డేట్ లు ఇవ్వాలి. ప్రీ రిలీజ్ లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వూలు దాదాపు అయిదారు సెంటర్లలో చేయాల్సి వుంటుంది. అంటే ఎనిమిది నెలల్లో దాదాపు రెండు నెలలు హీరో దీనికే కేటాయించాల్సి వస్తుంది. అదే సమయంలో సలార్, ప్రాజెక్ట్ షూట్ లు కావచ్చు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కావచ్చు చేయాల్సి వస్తుంది. ఇదంతా సాధ్యమేనా?

జూన్ నుంచి సంక్రాంతి లోపు రెండు సినిమాలు అయితే రీజనబుల్ గా వుంటుంది. పెర్ ఫెక్ట్ ప్లానింగ్ అవుతుంది. కానీ ఏ సినిమాను తప్పించగలరు?

అందుకే ఇండస్ట్రీలో కొత్త వార్తలు వినిపిస్తున్నాయి. ఆదిపురుష్ పక్కా. అవసరం అయితే సలార్ ను సంక్రాంతికి పంపిస్తారు. లేదూ..సలార్ కూడా పక్కా అంటే ప్రాజెక్ట్ కె ను జరుపుతారు అంటూ. కానీ ఇవన్నీ కూడా ఫ్యాన్స్ లో వినిపించేవే తప్ప యూనిట్ ల నుంచి ఏ సమాచారం లేదు. అన్ని యూనిట్ లు తమ తమ సినిమాల విడుదల డేట్ లు పక్కా అనే చెబుతున్నాయి.

ఆ మేరకు ఎనిమిది నెలల గ్యాప్ లో మూడు సినిమాలు వచ్చేస్తే… మళ్లీ నాలుగైదు నెలల గ్యాప్ లో మారుతి-ప్రభాస్ సినిమా వుంటుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?