శాకుంతలం అందుకే డిజాస్టర్ అయిందంట!

ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది శాకుంతలం సినిమా. భారీ బడ్జెట్ తో తీసి డిజాస్టర్ అయిన సినిమా, ఈ ఏడాది ఇప్పటివరకు ఇది మాత్రమే. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్…

ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది శాకుంతలం సినిమా. భారీ బడ్జెట్ తో తీసి డిజాస్టర్ అయిన సినిమా, ఈ ఏడాది ఇప్పటివరకు ఇది మాత్రమే. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి ఎన్నో కారణాలున్నాయి. అయితే ప్రధాన కారణం మాత్రం ఒకటి ఉందంటున్నారు సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. శాకుంతలం సినిమాను బాగా తీశారని మెచ్చుకుంటూనే, సెకెండాఫ్ లో లోపాల్ని ఆయన ఎత్తిచూపారు.

“కథ, కథనాల్లో చిన్న వ్యత్యాసం వస్తే రిజల్ట్ లో ఎంత తేడా వస్తుందో శాకుంతలం సినిమా చూస్తే తెలుస్తుంది. సెకండాఫ్ లో ఎప్పుడైతే ఉంగరం చూడగానే దుష్యంతుడికి శకుంతల గుర్తుకొచ్చిందని చెప్పారో, అక్కడే ప్రేక్షకులకు ఓ రకమైన భావన వచ్చేసింది. వీళ్లిద్దరూ ఇక కలుస్తారులే అనే ఫీలింగ్ చాలామందికి వచ్చేసింది. ఎలా కలుస్తారని ఆశగా చూసే ఆడియన్స్ కూడా ఉన్నప్పటికీ.. ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అక్కడ పనిచేయలేదు. దుష్యంత మహారాజు ఆమె బొమ్మ కూడా గీసేటప్పటికీ, ఇక ఇద్దరూ కలిసిపోతారని చిన్న పిల్లాడికి కూడా తెలిసిపోతుంది. అక్కడ ప్రేక్షకుడికి ఆసక్తి పోయింది. శాకుంతలం విషయంలో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను.”

సినిమా రెండో అర్థభాగానికి వచ్చేసరికి, శకుంతుల గురించి దుష్యంతుడు తెలుసుకునే ఎపిసోడ్ ను కొంచెం లేట్ చేసి పెట్టి ఉంటే ఇంకా బాగుండేదేమో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు పరుచూరి అంతేతప్ప, గుణశేఖర్ రాతలో, తీతలో ఎలాంటి లోపాల్లేవంటున్నారాయన.

ఓటీటీలో అందుబాటులో ఉన్న శాకుంతలం సినిమాను మరోసారి చూడమని విజ్ఞప్తి చేస్తున్నారు పరుచూరి గోపాలకృష్ణ. తను చెప్పిన తేడాలు, లోపాలు సెకండాఫ్ లో ఉన్నాయా లేదా అనే విషయాన్ని చెప్పాలని ప్రేక్షకుల్ని అడుగుతున్నారు. అయితే ఇదే విషయాన్ని, గుణశేఖర్ ను మాత్రం అడగనంటున్నారు. శకుంతల పాత్ర కోసం 5 అడుగుల 8 అంగుళాల అందమైన మహిళను ఊహించుకున్నానని, ఆ క్వాలిటీ సమంతలో లేకపోయినా బాగా చేసిందని మెచ్చుకున్నారు పరుచూరి.