కెరీర్ లో అతిపెద్ద రిస్క్ చేస్తున్న ప్రభాస్

పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ఉన్నప్పుడు రిస్క్ చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు స్టార్ హీరోలు. మరీ ముఖ్యంగా వరుస ఫ్లాపులొచ్చిన తర్వాత సేఫ్ గేమ్ ఆడాలని చూస్తారు. కానీ ప్రభాస్ మాత్రం ఈ…

పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ఉన్నప్పుడు రిస్క్ చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు స్టార్ హీరోలు. మరీ ముఖ్యంగా వరుస ఫ్లాపులొచ్చిన తర్వాత సేఫ్ గేమ్ ఆడాలని చూస్తారు. కానీ ప్రభాస్ మాత్రం ఈ లెక్కలన్నింటికీ విరుద్ధంగా వెళ్తున్నాడు. వరుస ఫ్లాపుల తర్వాత ఓ మైథలాజికల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఇది అతి పెద్ద రిస్క్.

హిట్ కోసం లవ్ స్టోరీలు చేసే హీరోలున్నారు, మాస్-యాక్షన్ కథలు చేసే హీరోలున్నారు. కానీ వీటికి పూర్తి విరుద్ధంగా ఆదిపురుష్ అనే భక్తిరస చిత్రంతో వస్తున్నాడు ప్రభాస్. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాతో సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు.

బాహుబలి-2 తర్వాత ఇప్పటివరకు సాలిడ్ హిట్ అందుకోలేదు ప్రభాస్. అతడు చేసిన సాహో భారీ అంచనాల మధ్య వచ్చి ఫ్లాప్ అయింది. రాధేశ్యామ్ కూడా ఫ్లాప్ అయింది. ఇలాంటి టైమ్ లో ఆదిపురుష్ తో ప్రయోగం చేస్తూనే, హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు ప్రభాస్.

తన కెరీర్ లో ప్రభాస్ చేస్తున్న తొలి మైథలాజికల్ మూవీ ఇది. ఇంతకుముందు ఇలాంటి పురాణ పాత్రల్లో నటించిన అనుభవం అతడికి లేదు. సో.. రాఘురాముడిగా ప్రభాస్ ఎలా మెప్పిస్తాడనేది పెద్ద ప్రశ్న. ఈ విషయంలో సీనియర్ ఎన్టీఆర్ పోషించిన రాముడి పాత్రలతో, ఆదిపురుష్ ను కచ్చితంగా కంపేర్ చేస్తారు.

ప్రభాస్, ఓవైపు ఈ పోలికలను మ్యాచ్ చేస్తూనే, మరోవైపు రాముడి పాత్రపై తనదైన ముద్ర వేయాల్సిన అవసరం ఇది. కత్తిమీద సాములాంటి ఈ వ్యవహారంలో ఏమాత్రం తేడా కొట్టినా కెరీర్ లో మరో మిస్టేక్ చేసినవాడవుతాడు ప్రభాస్.

ప్రస్తుతానికైతే ఆదిపురుష్ పై సరైన అంచనాలున్నాయి. ట్రయిలర్, ఫస్ట్ సాంగ్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి. మూవీ క్లిక్ అయితే ప్రభాస్ ఓ పెద్ద ప్రయోగం చేయడంతో పాటు, భారీ విజయాన్ని అందుకున్నట్టవుతుంది. ఈ సినిమా సక్సెస్ అయితే, పురాణ పాత్రలకు ఓ స్టార్ హీరో దొరికినట్టవుతుంది.