3 సినిమాలు.. 3 ఫలితాలు..

ఈ వారం సినిమాల వాస్తవ రూపం బయటపడింది. భారీ హైప్ తో వచ్చిన సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోగా, భారీ ప్రచారంతో వచ్చిన సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక ఎలాంటి అంచనాలు లేకుండా…

ఈ వారం సినిమాల వాస్తవ రూపం బయటపడింది. భారీ హైప్ తో వచ్చిన సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోగా, భారీ ప్రచారంతో వచ్చిన సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమా మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. ఆ మూడు సినిమాల వివరాలు..

మళ్లీ పెళ్లి.. సీనియర్ నటుడు నరేష్ నిజజీవితంలో జరిగిన ఘటనలతో తెరకెక్కిన సినిమా. రిలీజ్ కు ముందే ఈ సినిమాపై భారీ హైప్ ఉంది. కానీ ఆ హైప్ ను సినిమా కంటిన్యూ చేయలేకపోయింది. నరేష్-పవిత్ర లివ్-ఇన్ పై ఆసక్తి ఉన్న జనాలను మాత్రమే ఈ సినిమా ఎట్రాక్ట్ చేస్తోంది.

భారీ ప్రచారంతో ఊదరగొట్టిన సినిమా మేమ్ ఫేమస్. మహేష్ బాబు నుంచి నాగచైతన్య వరకు చాలామంది హీరోలు ఈ సినిమాకు ప్రచారం చేశారు. అవన్నీ మొదటి రోజు వరకు పనిచేశాయి. అయితే కంటెంట్ తేలిపోవడంతో, శనివారం నుంచి ఈ సినిమాకు ఆక్యుపెన్సీ పడిపోయింది.

ముచ్చటగా మూడో సినిమా 2018. ఇదొక డబ్బింగ్ సినిమా. రీసెంట్ రిలీజెస్ లో క్లిక్ అయిన సినిమా ఇదే. మొదటి రోజు కోటి రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమాకు, రెండో రోజు సరికి వసూళ్లు 70 శాతం పెరిగాయి. ఈ సినిమాలతో పాటు వచ్చిన జైత్ర, మెన్ టూ, గ్రే, అడ్డతీగల సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.