Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఆదిపురుష్ తెలుగు - బిగ్ డీల్

ఆదిపురుష్ తెలుగు - బిగ్ డీల్

ప్రభాస్-ఓం రౌత్ పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్. ఈ సినిమా మెలమెల్లగా అంచనాలు పెంచుకుంటోంది. కంటెంట్ బయటకు వస్తున్న కొద్దీ సినిమా బజ్ పెరుగుతోంది. ఈ సినిమా తెలుగు థియేటర్ హక్కులు, నిర్మాణ భాగస్వామ్యంలో భాగంగా యువి సంస్థకు వచ్చాయి. 

ఇప్పుడు వీటిని మార్కెట్ చేసుకోవాలి. ఏ ఏరియా ఎంత రేంజ్ వరకు మార్కెట్ అవుతుంది అన్నది పాయింట్. సలార్ లాంటి కమర్షియల్ సినిమా వేరు. ఆదిపురుష్ వేరు. దీనిని అంచనా కట్టడం కష్టం. జనాలకు పట్టేస్తే ఏ రేంజ్ కు అయినా వెళ్తుంది.

ఇలాంటి నేపథ్యంలో ఓ జాక్ పాట్ డీల్ యువి సంస్థ తలుపు తట్టినట్లు తెలుస్తోంది. ఓ భారీ తెలుగు నిర్మాణ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాల వెర్షన్ థియేటర్ హక్కులను హోల్ సేల్ గా తీసేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిన్న రాత్రి డీల్ ఫైనల్ అయింది. 170 కోట్లకు కాస్త అటు ఇటుగా ఈ డీల్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఇది చాలా పెద్ద మొత్తమే అని చెప్పాలి.

ఆ నిర్మాణ సంస్థ ఇప్పుడు దీన్ని మళ్లీ రిటైల్ గా అమ్ముకోవాల్సి వుంటుంది. ఈ మేరకు డీల్ సెట్ అయింది. ఇకపై ఆదిపురుష్ పోస్టర్ లో ఈ సంస్థ పేరు కూడా నిర్మాతలుగా వుంటుంది.

 


  • Advertisement
    
  • Advertisement