ఆదిపురుష్.. అసలు సిసలైన గ్లోబల్ ఈవెంట్

టాలీవుడ్ పాన్ ఇండియా లెవెల్ కు వెళ్లింది. కొన్ని పెద్ద సినిమాలకు ప్రమోషన్స్ కూడా పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్నారు. ఆదిపురుష్ సినిమా ఇప్పుడీ స్థాయిని ఇంకాస్త పెంచింది. పాన్ ఇండియా నుంచి పాన్…

టాలీవుడ్ పాన్ ఇండియా లెవెల్ కు వెళ్లింది. కొన్ని పెద్ద సినిమాలకు ప్రమోషన్స్ కూడా పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్నారు. ఆదిపురుష్ సినిమా ఇప్పుడీ స్థాయిని ఇంకాస్త పెంచింది. పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ స్థాయికి చేరింది ఆదిపురుష్.

మరో 3 రోజుల్లో.. 9వ తేదీన ఆదిపురుష్ ట్రయిలర్ ను లాంఛ్ చేయబోతున్నారు. దీని కోసం ఓ భారీ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఇదో పెద్ద గ్లోబల్ ఈవెంట్. ఏకంగా, 70 దేశాల్లో ఈ ట్రయిలర్ ను ప్రదర్శించబోతున్నారు.

అమెరికా, కెనడా, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, రష్యా, ఈజిప్ట్.. ఇలా చెప్పుకుంటూపోతే ముఖ్యమైన అన్ని దేశాల్లో ఆదిపురుష్ ట్రయిలర్ ను ప్రదర్శించబోతున్నారు.

ఆదిపురుష్ సినిమాకు సంబంధించి ఇప్పటికే టీజర్ రిలీజైంది. జై శ్రీరామ్ అనే థీమ్ సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడీ ట్రయిలర్ లాంఛ్ తో సినిమా ప్రచారం పీక్ స్టేజ్ కు చేరబోతోంది. ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా భారీ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి, ఖమ్మంలో పెద్ద కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్నారు.

ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించిన ఈ సినిమాలో రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించాడు. ఓం రౌత్ డైరక్ట్ చేసిన ఈ సినిమాను జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.