మళ్లీ బాయ్ ఫ్రెండ్ తో కనిపించిన హీరోయిన్

హీరోయిన్ అదితిరావు హైదరి, హీరో సిద్దార్థ్ తగ్గేదేలే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. మొన్నటివరకు కాస్త గుంభనంగా సాగిన వీళ్ల వ్యవహారం కొన్నాళ్ల కిందట ఓపెన్ అయింది. ఎప్పుడైతే బహిరంగం అయిందో ఇక అప్పట్నుంచి ఈ జంట…

హీరోయిన్ అదితిరావు హైదరి, హీరో సిద్దార్థ్ తగ్గేదేలే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. మొన్నటివరకు కాస్త గుంభనంగా సాగిన వీళ్ల వ్యవహారం కొన్నాళ్ల కిందట ఓపెన్ అయింది. ఎప్పుడైతే బహిరంగం అయిందో ఇక అప్పట్నుంచి ఈ జంట అస్సలు తగ్గడం లేదు. ప్రస్తుతం సిద్దార్థ్ ఎక్కడుంటే, అదితి అక్కడ. అదితి ఎక్కడుంటే సిద్దార్థ్ అక్కడ. 

చివరికి అదితిరావుకు సంబంధించిన పార్టీల్లో కూడా తనకు సంబంధం లేకపోయినా సిద్దార్థ్ కనిపిస్తున్నాడు. రీసెంట్ గా ఓ వెబ్ సిరీస్ లో నటించింది అదితి. దానికి సంబంధించిన సక్సెస్ పార్టీ ముంబయిలో రాత్రి గ్రాండ్ గా జరిగింది. నిజానికి ఈ వెబ్ సిరీస్ కు, సిద్దార్థ్ కు సంబంధం లేదు. కానీ అక్కడ సిద్దార్థ్ ప్రత్యక్షమయ్యాడు. 

అదితి బాయ్ ఫ్రెండ్ అనే హోదాలో అతడు ఆ పార్టీకి హాజరయ్యాడు. యూనిట్ లో కీలక సభ్యులతో పాటు అతడికి కూడా రెడ్ కార్పెట్ స్వాగతం దక్కింది. ఏమాత్రం మొహమాటపడకుండా సిద్దార్థ్ కూడా పార్టీని ఎంజాయ్ చేశాడు. 

మహాసముద్ర సినిమాతో అదితిరావు, సిద్దార్థ్ కలిశారు. ఆ సినిమా డిజాస్టర్ అయినా, వీళ్ల రిలేషన్ షిప్ మాత్రం బ్లాక్ బస్టర్ అయింది. తమ పరిచయాన్ని నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది ఈ జంట. విదేశీ పర్యటనలు, ఇనస్టా రీల్స్ తో ఎంజాయ్ చేసిన ఈ కపుల్, ఇప్పుడు తమ బంధాన్ని మీడియా కెమెరాల ముందుకు తీసుకొచ్చింది.