చిన్న సినిమాకు మెగా ఆశీస్సులు

హనుమాన్ సినిమాకు చిరంజీవి మద్దతు పలికారు. ఆ సినిమా ఫంక్షన్ కు ప్రత్యేక అతిథిగా హాజరై, ప్రచారంలో భాగమయ్యారు. సంక్రాంతి బరిలో నిలిచిన ఆ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు…

హనుమాన్ సినిమాకు చిరంజీవి మద్దతు పలికారు. ఆ సినిమా ఫంక్షన్ కు ప్రత్యేక అతిథిగా హాజరై, ప్రచారంలో భాగమయ్యారు. సంక్రాంతి బరిలో నిలిచిన ఆ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు మరో చిన్న సినిమాకు మెగా ఆశీస్సులు దక్కాయి.

కమెడియన్ హర్ష తొలిసారి హీరోగా మారి నటించిన సినిమా సుందరం మాస్టర్. హీరో రవితేజ, ఈ సినిమాకు ఒక నిర్మాత. ఇప్పుడీ సినిమా ప్రచారంలోకి చిరంజీవి ఎంటర్ అయ్యారు. సుందరం మాస్టర్ ట్రయిలర్ ను రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా హర్షను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు చిరంజీవి. హర్ష కోసమే ఈ పాత్ర, ఈ కథ పుట్టినట్టు ఉందని అభిప్రాయపడ్డారు. తనలా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన హర్షను చూసి గర్విస్తున్నానని అన్నారు. దీంతో హర్ష బాగా ఎమోషనల్ అయి కంటతడి పెట్టుకున్నాడు.

ఇక ట్రయిలర్ విషయానికొస్తే, టీజర్ లో కేవలం కామెడీకే ప్రాధాన్యతనిచ్చిన మేకర్స్, ట్రయిలర్ లో చిన్న కాన్ ఫ్లిక్ట్ పాయింట్ ను కూడా ఎస్టాబ్లిష్ చేశారు. కేవలం కామెడీ కాకుండా, మంచి ఎమోషన్ కూడా ఉంటుందనే విషయాన్ని చెప్పారు.

కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 23న విడుదల కాబోతోంది. నిర్మాతగా ఇప్పటివరకు సరైన సక్సెస్ అందుకోలేదు రవితేజ. ఈ సినిమా అయినా కలిసొస్తుందేమో చూడాలి.