యువ కథానాయకుడు నితన్, కధానాయకి రష్మికా మందన్నా జంటగా నటించిన చిత్రం ‘భీష్మ’ గత నెల 21న విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాపై పాజిటివ్ టాక్ కూడా వచ్చింది. ‘ఛలో’ ఫేమ్ దర్శకుడు వెంకీ కుడుముల నేతృత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇచ్చిన కిక్‌తో హీరో నితిన్‌లో కొత్త ఉత్సాహం వచ్చింది. అయితే సినిమా విడుదల తర్వాత కూడా ఆ సినిమాను వివాదాలు చుట్టుకోవడం ఆశ్చర్యపరుస్తోంది.
తాజాగా ఈ చిత్రంపై గంగపుత్ర సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో భీష్మ మరోసారి చర్చనీయాంశమైంది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు అభ్యంతకరంగా ఉన్నాయనేది ఆయన ఫిర్యాదులోని ప్రధాన సారాంశం. అందువల్ల సినిమాలోని అభ్యంతకర దృశ్యాలను తొలగించాలని ఆ ఫిర్యాదులో ఆయన పేర్కొన్నాడు.
మహాభారతంలో భీష్ముడు గంగపుత్రుడనే విషయం తెలిసిందే. ఆయన పేరుతో విడుదలైన చిత్రంపై మొదటి నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే వస్తున్నారు. ప్రస్తుతం మరోసారి ఈ సినిమాపై మానవ హక్కుల కమిషన్ ఏ విధంగా స్పందిస్తుందో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.