హీరో అఖిల్ ఎక్కడ ఎంటర్ అయితే అక్కడ కథలు అటు ఇటు తిరిగి, టైమ్ తీసుకుంటున్నారు. బ్యాచులర్ సినిమా విషయంలో ఇలాగే అయింది. మొత్తానికి ఏదో విధంగా బయటపడింది.
ఏజెంట్ సినిమా విషయం కూడా అలాగే అవుతోంది. సినిమా ఇలా ప్రారంభించి అలా ఆపారు. ఆ తరువాత విదేశాలకు వెళ్లారు. సగంలోనే వెనక్కు రావాల్సి వచ్చింది.
అవన్నీ టెక్నికల్ సమస్యలు అనుకుంటే స్క్రిప్ట్ లో ఛేంజెస్ అనే వార్తలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా చిన్న చిన్న మార్పులు కాదు, స్క్రిప్ట్ ను మొత్తం రిప్రెష్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
తన పనులు అన్నీ ఫినిష్ చేసుకుని ఫ్రీ అయిన హీరో నాగ్ స్క్రిప్ట్ గురించి అంతా తెలుసుకుని అసంతృప్తి వ్యక్తం చేసారని, దాంతో స్క్రిప్ట్ ను మళ్లీ వండే పనిలో పడ్డారని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాను హీరో అఖిల్ రెమ్యూనిరేషన్ లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. రెమ్యూనిరేషన్ లేకపోవడం ప్లస్ అయితే ఇలా స్క్రిప్ట్ ను ముందుకు వెనక్కు మారుస్తూ, ఒకటి రెండు సార్లు సవరిస్తూ వుంటే ఆ డబ్బులు కాస్తా వడ్డీలకు వర్కింగ్ డేస్ కు సరిపోతాయేమో?