Advertisement

Advertisement


Home > Movies - Movie News

వైల్డ్ సాలే సమ్మర్ కు వస్తున్నాడు

వైల్డ్ సాలే సమ్మర్ కు వస్తున్నాడు

అఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో వాయిదా వేశారు.

అలా వాయిదా వేసిన సినిమాను ఇప్పుడు సమ్మర్ కు షెడ్యూల్ చేశారు. ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్ థియేటర్లలోకి ఏజెంట్ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు.

అఖిల్ ను విలన్ కట్టిపడేస్తాడు. కుర్చీకి కట్టేసి కొడుతుంటాడు. ఎవరు పంపించారో చెప్పమని సాలే అంటూ తిడతాడు. సాలే కాదు, వైల్డ్ శాలే అని పిలవమంటాడు అఖిల్. కొద్దిసేపటి కిందట ఈ వీడియోను రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో అఖిల్ గూఢచారిగా నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో అనీల్ సుంకర నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సాక్షి వైద్య టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమౌతోంది. మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఏజెంట్ నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత మేకింగ్ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తూ విడుదల చేసిన తాజా వీడియో కూడా బాగుంది. ఓవరాల్ గా సరైన అంచనాల్నే క్రియేట్ చేసింది ఏజెంట్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?