విశాఖకు మరో రాజధాని హోదా…!

విశాఖ ఏపీకి అతి పెద్ద ఆస్తిగా ఉంది. మెగా సిటీ. ఏమి చేయాలన్నా విశాఖను చూపించే చేయాలి. ఆ విషయం గత తెలుగుదేశం ప్రభుత్వానికీ తెలుసు. అందుకే జాతీయ అంతర్జాతీయ సదస్సులు అన్నీ విశాఖ…

విశాఖ ఏపీకి అతి పెద్ద ఆస్తిగా ఉంది. మెగా సిటీ. ఏమి చేయాలన్నా విశాఖను చూపించే చేయాలి. ఆ విషయం గత తెలుగుదేశం ప్రభుత్వానికీ తెలుసు. అందుకే జాతీయ అంతర్జాతీయ సదస్సులు అన్నీ విశాఖ వేదికగానే జరిపింది. కానీ విశాఖను రాజధాని అని గట్టిగా చెప్పలేకపోయింది. దానికి కారణం కోస్తా మీద ప్రేమ ఉండడం. పైగా అమరావతి రాజధాని అంటూ బాహుబలి ప్రయోగాలు చేయడమే.

వైసీపీకి ఆ ఇబ్బందులు ఏమీ లేవు. విశాఖను రాజధానిగా చేసుకుంటే అంతా బాగుంటుంది అని మొదటి నుంచి ఆలోచన చేస్తున్న నాయకుడు జగన్. ఉమ్మడి ఏపీలో కూడా హైదారాబాద్ తరువాత విశాఖ పేరు మాత్రమే వినిపించేది. మిగిలినవి అన్నీ టైర్ టూ సిటీస్ కూడా కావు. దాంతో విశాఖను ముందు పెట్టుకుంటేనే ఏపీకి గ్రోత్ ఇంజన్ అవుతుంది అన్నది జగన్ ఆలోచన. ఈ విషయంలో ఆయన ఏపీ ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకునే ఆలోచన చేశారు అని మేధావులు కానీ తటస్థులు కానీ గట్టిగా చెబుతారు.

విశాఖను కేవలం పరిపాలనా రాజధానిగానే కాదు టాలీవుడ్ ని కూడా షిఫ్ట్ చేసి సినీ రాజధానిగా చేయాలని జగన్ తపన పడుతున్నారు. ఈ మేరకు ఆయన టాలీవుడ్ ప్రముఖులతో పెద్దలతో కూడా అనేక దఫాలు చర్చించారు. అయితే టాలీవుడ్ హైదరాబాద్ లోనే స్థిరపడిపోయినందువల్ల అనుకున్నంత వేగంగా ఆ ప్రయత్నం అయితే ముందుకు సాగే అవకాశం కంపించడంలేదు. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం అదే పట్టుదలతో ఉంది అని అంటున్నారు.

అందుకోసం విశాఖలో వంద ఎకరాలు పైగా ల్యాండ్ బ్యాంక్ కి రెడీ చేసి పెట్టారని తెలుస్తోంది. కనీసం పది నుంచి ఇరవై మంది దాకా బడా నిర్మాతలు దర్శకులు, హీరోలు విశాఖకు షిఫ్ట్ అయితే వారు స్టూడియోలు నిర్మించుకోవడానికి ఈ వంద ఎకరాలు ఇవ్వాలని  ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. అయితే అది ఈ దఫాలో జరిగే అవకాశం కనిపించడం లేదు. జగన్ రెండవసారి సీఎం అయితే 2024 నుంచి విశాఖలో సినీ రాజధానికి అడుగులు పడతాయని అంటున్నారు.

హైదరాబాద్ లో సినిమా పరిశ్రమ ఉంది. ఫ్యూచర్ లో అక్కడ తెలంగాణా వారి నుంచి వత్తిడి ఉంటుంది. అపుడు ఏపీకి సంబంధించి సినీ పరిశ్రమ డెవలప్ కావాలంటే విశాఖ ఎంతో అనువైన ప్రదేశం అని అంటున్నారు. పక్కనే రాజమండ్రీ కూడా ఉండడంతో ఏ విధంగా చూసినా విశాఖ టాలీవుడ్ కి బెస్ట్ స్పాట్ అవుతుంది అని అంటున్నారు. దానికి  సంబంధించి వైసీపీ ప్రభుత్వంలో కదలిక అయితే వచ్చింది. ఇది మెటీరియలైజ్ కావాలంటే కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఏది ఏమైనా విశాఖ చిత్ర సీమకు ఏదో నాడు రాజధాని అవడం ఖాయమనే అంతా అంటున్నారు.