ఆహా…అనిపించిన వన్ అండ్ ఓన్లీ

ఆహా ఓటిటి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి దాన్ని నిలబెట్టేందుకు, ముందుకు సాగేందుకు వీలుగా చాలా అంటే చాలా చేస్తున్నారు. ఇటు అల్లు అరవింద్, అటు మైహోమ్ రామ్ అంతా వాళ్ల వాళ్ల ప్లానింగ్,…

ఆహా ఓటిటి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి దాన్ని నిలబెట్టేందుకు, ముందుకు సాగేందుకు వీలుగా చాలా అంటే చాలా చేస్తున్నారు. ఇటు అల్లు అరవింద్, అటు మైహోమ్ రామ్ అంతా వాళ్ల వాళ్ల ప్లానింగ్, సర్కిల్ అంతా వాడుతున్నారు. సమంత ను హోస్ట్ గా తెచ్చి మెగాస్టార్ ను గెస్ట్ గా తేవడం అంటే అందరికీ సాధ్యం కాదు. 

ఆహా లో ఇప్పటి వరకు హర్ష లెవెల్ నుంచి సమంత లెవెల్ వరకు చాలా అంటే చాలా ట్రయ్ చేసారు. ఎన్ని చేసినా రాని ఊపు కేవలం ఒకే ఒక్క షో తో వచ్చింది. అదే బాలయ్య అన్ స్టాపబుల్. పాపులారిటీ వున్న ఓ మాస్ హీరో వచ్చి చాట్ షో చేయడం అంటే మాటలు కాదు. 

నాగ్, చిరు, ఎన్టీఆర్ వీళ్లంతా కూడా బిగ్ బాస్, మీలో ఎవరు కోటీశ్వరుడు లాంటి షో లు ట్రయ్ చేసారు తప్ప చాటింగ్, ఇంటర్వ్యూల వంటివి చేయలేదు. ఎందుకంటే ఓ స్థాయి ఇమేజ్ వున్నవాళ్లు ఓ సాధారణ ఇంటర్వ్యూయర్ లెవెల్ కు వచ్చేసి, ప్రశ్నలు వేసి, వాళ్లు చెప్పేది వింటూ కూర్చోవడం సాధ్యం అయ్యేది కాదు. వాళ్ల ఇమేజ్ కావచ్చు, లెవెల్ కు కావచ్చు అంత సులువుగా నప్పేది కాదు.

కానీ బాలకృష్ణ ఈ బారియర్స్ అన్నీ దాటి వచ్చేసారు. చందో బందో బస్త్ లు అన్నీ తెంచేసారు. బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో లో హీరోగా అస్సలు కనిపించడం లేదు. తన లోని ఫన్ యాంగిల్స్ అన్నీ చూపిస్తున్నారు. సాధారణంగా బాలయ్య స్పీచ్ ల్లో చాలా తడబడతారు. ఏదేదో మాట్లాడతారు. జనాలకు కాస్త అర్థం కాదు కూడా.

కానీ అన్ స్టాపబుల్ లో ఈ సమస్య కనిపించడం లేదు. అనిల్ రావిపూడి ఎపిసోడ్ లో బ్రహ్మానందంతో కలిసి ఆయన ఫన్ సూపర్ గా పండించారు. అదే మోడల్ లో మళ్లీ మరో ఎపిసోడ్ లో థమన్ ను పట్టుకున్నారు. 

మొత్తం మీద ఈ మధ్య కాలంలో చూడడానికి ఇంట్రస్ట్ కలిగించేలా అన్ స్టాపబుల్ చాట్ షో తయారవుతోంది. ఇప్పటి వరకు తెలుగులో చాట్ షో లు ఓ రెగ్యులర్ ఫార్మాట్ లో వుండేవి. కాస్త బోర్ కొట్టేవి. ఇక్కడ ఆ సమస్య కాస్త తక్కువే వుంది. 

రైటర్ గా సక్సెస్ అయినా, డైరక్టర్ గా సక్సెస్ కాలేకపోయిన బివిఎస్ రవి (మచ్చ రవి) ఈ షో తో డిజిటల్ మీడియాలో సెట్ అయిపోయేలాగే వున్నారు.