అల్లు అర్జున్ మేకప్ కష్టాలు

పుష్ప సినిమాకు సంబంధించి తనకు కష్టమైన పార్ట్ ఏంటనేది బయటపెట్టాడు హీరో అల్లు అర్జున్. ఈ సినిమాలో యాక్టింగ్ కంటే మేకప్ వేసుకోవడం, తీసుకోవడం తనకు చాలా ఇబ్బందిగా మారిందన్నాడు. కేవలం మేకప్ కోసమే…

పుష్ప సినిమాకు సంబంధించి తనకు కష్టమైన పార్ట్ ఏంటనేది బయటపెట్టాడు హీరో అల్లు అర్జున్. ఈ సినిమాలో యాక్టింగ్ కంటే మేకప్ వేసుకోవడం, తీసుకోవడం తనకు చాలా ఇబ్బందిగా మారిందన్నాడు. కేవలం మేకప్ కోసమే ఉదయం నాలుగున్నరకు లేవాల్సి వచ్చేదని చెప్పుకొచ్చాడు.

“ఉదయం నాలుగున్నరకు లేచేవాడ్ని. అప్పుడు మేకప్ కు కూర్చుంటే 7 అయ్యేది. అప్పుడు సుకుమార్ దగ్గరకు వెళ్తే, మళ్లీ ఆయన మార్పులు చెప్పేవారు. ఇక అక్కడ్నుంచి సాయంత్రం వరకు అదే మేకప్ తో ఉండేవాడ్ని. తిరిగి మళ్లీ సాయంత్రం మేకప్ తీయడానికి మరో 20 నిమిషాలు టైమ్ పట్టేది.”

ఇలా పుష్పరాజ్ పాత్ర కోసం పడిన మేకప్ కష్టాల్ని బయటపెట్టాడు బన్నీ. కెరీర్ లో ఎప్పుడూ మేకప్ కోసం ఇంత కష్టపడలేదన్నాడు. కేవలం తను మాత్రమే కాకుండా.. రష్మిక, సునీల్, అనసూయ కూడా మేకప్ విషయంలో చాలా కష్టపడ్డారని అన్నాడు.

“కెరీర్ లో ఎప్పుడూ మేకప్ పై ఇంత ఫోకస్ పెట్టలేదు. పుష్ప సినిమాకు మాత్రం తప్పలేదు. ఆ రఫ్ లుక్ తీసుకురావడం కోసం చాలా కష్టపడ్డాం. కేవలం ముఖానికే కాదు. కాళ్లు, మెడ, చేతులు, ఛాతికి కూడా మేకప్ వేయాల్సి వచ్చింది. మేకప్ వేసుకోవడానికి చాలా ఇబ్బంది అయింది.”

ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తోంది పుష్ప సినిమా. సుకుమార్ డైరక్ట్ చేసిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే అడ్వాన్స్ బుకింగ్ జోరుగా సాగుతోంది.