అఖండ వచ్చింది.. ప్రజల్ని కరోనా నుంచి కాపాడింది!

రానురాను బాలయ్య ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదు. అఖండ సక్సెస్ అవ్వడంతో ఆలయాల సందర్శన చేపట్టిన బాలయ్య.. ఈసారి కొత్త పల్లవి అందుకున్నారు. అఖండ సినిమాలో తను చెప్పిన డైలాగులు, మంత్రాల్లో…

రానురాను బాలయ్య ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదు. అఖండ సక్సెస్ అవ్వడంతో ఆలయాల సందర్శన చేపట్టిన బాలయ్య.. ఈసారి కొత్త పల్లవి అందుకున్నారు. అఖండ సినిమాలో తను చెప్పిన డైలాగులు, మంత్రాల్లో పనిచేసి, ప్రజల్లో కరోనాను తగ్గించాయని చెప్పుకొచ్చారు బాలయ్య.

“కరోనా వచ్చింది. ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అలాంటి తరుణంలో అఖండ సినిమా వాళ్లలో దైవత్వాన్ని తీసుకొచ్చింది. కరోనా బారి నుంచి ప్రజల్ని కాపాడింది. థియేటర్లలో ఒక్కో శబ్దం బీజాక్షరమైంది. శబ్దంలో కూడా పవర్ ఉంటుంది. అది కూడా మనపై పనిచేస్తుంది. నోటి నుంచి వచ్చే మంత్రం కూడా రోగాలకు నివారణ. అఖండ సినిమాలో శబ్దాల్ని మంత్రాలుగా తీసుకున్నారు జనం.”

ఏపీలో టికెట్ రేట్ల వ్యవహారంపై కూడా స్పందించారు బాలయ్య. అఖండ వచ్చి ప్రజల్ని కాపాడిందని, ఇకపై తను ఇండస్ట్రీని కాపాడతానంటూ డైలాగ్స్ కొట్టారు.

“టికెట్ రేట్లపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీల్ కు వెళ్తామంటోంది. మిగతా ఇండస్ట్రీ జనాలు కూడా వెళ్తాం అంటున్నారు. ఇవన్నీ చూసి మేం నిర్ణయం తీసుకుంటాం. తప్పకుండా ఇండస్ట్రీని కాపాడతాం. రాష్ట్రాన్ని ఈ సినిమా కాపాడింది. ఇక ముందు మేం మొత్తం ఇండస్ట్రీని కాపాడతాం.”

మల్టీస్టారర్ మూవీస్ పై స్పందిస్తూ.. తనతో చేయడానికి అవతలోడికి కూడా ధైర్యం ఉంటే మల్టీస్టారర్ మూవీస్ చేస్తానన్నారు బాలయ్య. మంచి కథ సెట్ అవ్వడంతో పాటు, అవతలి హీరోకు కూడా తనతో చేసేంత ధైర్యం అవసరమని అభిప్రాయపడ్డారు.