హీరో నాని అంటే సినిమా ప్రేక్షకులందరికీ పక్కింటి కుర్రోడు. చాలా మంది మిడిల్ క్లాస్ కుర్రాళ్లు అతనిలో తమని ఐడింటిఫై చేసుకుంటూ వుంటారు. కానీ గత కొంత కాలంగా తన ఇమేజ్ ను మార్చుకునే ప్రయత్నంలో వున్నారు.
మెచ్యూర్డ్ రోల్స్ కోసం చూస్తున్నారు. సినిమాలు ఫ్లాప్ అయినా, హిట్ అయినా పాత్రల్లో చేంజ్ చూసుకుంటూ, తనకు రాయగలిగే పాత్రలకు లిమిటేషన్ లేదనే విధంగా వెళ్తున్నారు. ఒక విధంగా తన కెరీర్ ను లాంగ్ టెర్మ్ గోల్ తో, డిజైన్ చేసుకునే ప్రయత్నం అది. ఎప్పటికీ సాఫ్ట్, మిడిల్ క్లాస్ 'కుర్రాడి' పాత్రలు అంటే రైటర్స్ కు కూడా ఒక స్టేజ్ వచ్చేసరికి చేతులెత్తే పరిస్థితి వస్తుంది
గ్యాంగ్ లీడర్, వి సినిమా ల్లో పాత్రలు నాని రెగ్యులర్ పాత్రలు కావు. అతని స్టయిల్ కు దూరంగా వుండే పాత్రలు. అలాగే టక్ జగదీష్ కూడా డిఫరెంట్ రోల్ నే. కానీ గమ్మత్తేమిటంటే ఇలా 'ఎదిగిన' రోల్స్ చేస్తున్నపుడల్లా నాని ని ప్రేక్షకులు డిస్సపాయింట్ చేస్తూనే వస్తున్నారు.
వాళ్లకు కావాల్సింది ఎంసిఎ, నిన్నుకోరి, భలే భలే మగాడివోయ్ఇలాంటివే. అయితే దానికి కారణం రోల్స్ మాత్రమే కాదు. ఆ 'స్టేజ్' రోల్స్ లో ఫన్ పండించడానికి ఆస్కారం దొరుకుతోంది. కానీ ఈ 'ఎదిగిన' రోల్స్ లో అది మిస్ అవుతోంది. స్టయిల్ తో కూడిన ఫన్ జనాలకు ఎక్కడం లేదు. గ్రౌండ్ లెవెల్ ఫన్ ను వాళ్లు నాని నుంచి కోరుకుంటున్నారు.
లేటెస్ట్ గా శ్యామ్ సింగరాయ్ సినిమా వస్తోంది. ఇందులో బెంగాలీ రచయితగా, మార్కిస్ట్ భావజాలం కల వ్యక్తిగా చాలా పెద్ద క్యారెక్టర్ ను తలకెత్తుకున్నాడు. లుక్ అచ్చంగా అరవైల్లోని బెంగాలీ బాబుగా మార్చుకున్నాడు. ఇలాంటి క్యారెక్టర్ నుంచి ప్రేక్షకులు నాని నుంచి కోరుకునే ఫన్ రమ్మన్నా రాదు.
అందుకే సినిమాలో వున్న రెండో పాత్రను దానికి అనుగుణంగా మార్చుకున్నట్లు కనిపిస్తోంది. సినిమా డైరక్టర్ గా ఫన్, పోలీస్ స్టేషన్ సీన్లో ఫన్ అదే విషయం చెబుతున్నాయి. అంతకు మించి కృతిశెట్టితో ఓ మాంచి రొమాంటిక్ సీన్ కూడా చేసేసాడు. ఆత్రంగా కృతి వేసుకున్న ఓవర్ కోట్ ను తీసేయడం, లిప్ లాక్ ఇవన్నీ తన రెగ్యులర్ మార్క్ కు దగ్గరగా వుండేలా చూసుకున్నాడు
మొత్తం మీద నాని ఓ పక్కన ఓ లెవెల్ కు దాటిన పాత్రలు చేయాలనుకుంటున్నాడు. కానీ అదే సమయంలో తన ఒరిజినల్ ఇమేజ్ అతన్ని వెనక్కు లాగుతోంది. అక్కడే నాని పట్టుదలగా ప్రయత్నిస్తున్నది.